లక్ష పెట్టి ఓజీ సినిమా కొన్న పవన్ కళ్యాణ్ అభిమాని

-

చిత్తూరు జిల్లా జనసేన అభిమానులు అదిరిపోయే ప్లాన్ చేశారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఓజీ” సినిమా ఫస్ట్ టికెట్ కోసం నిర్వహించిన వేలంలో ఒక అభిమాని భారీ మొత్తాన్ని ఖర్చు చేశాడు. ఆ టికెట్‌ను ఆయన ₹1 లక్షకు కొనుగోలు చేశారు. ఈ త‌రుణంలోనే స‌ద‌రు థియేటర్ యాజమాన్యం ఓ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది.

Pawan Kalyan fan buys first ticket for OG movie in Chittoor for Rs 1 lakh
Pawan Kalyan fan buys first ticket for OG movie in Chittoor for Rs 1 lakh

అభిమానితో వచ్చిన ఆ లక్ష రూపాయలను తమ వద్ద ఉంచకుండా, గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగం అయ్యేలా జనసేన పార్టీ కార్యాలయానికి పంపించేందుకు సిద్ధమయ్యారు.

అటు తెలంగాణలో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ టికెట్ ధరలు పెంచారు. స్పెషల్ ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చారు. సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు స్పెషల్ ప్రీమియర్ ఉండ‌నున్నాయి. టికెట్ రేటు రూ. 800 ఫిక్స్ చేశారు. 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ రూ.100, మల్టీఫ్లెక్స్ రూ.150గా ఫైన‌ల్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news