ఏపీలో మరో స్కామ్ ను బయటపెట్టారు ఏబీ వెంకటేశ్వరరావు. లిక్కర్ స్కామ్ కంటే అతిపెద్ద కుంభకోణం విద్యుత్ స్కామ్ అన్నారు ఏబీ వెంకటేశ్వరరావు. లిక్కర్ స్కామ్ కేవలం రూ.3 వేల కోట్లే.. విద్యుత్ స్కామ్ రూ.40 వేల కోట్లు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏబీ వెంకటేశ్వరరావు.

విద్యుత్ రంగం ప్రభుత్వాలకు బంగారు బాతుగా మారిందన్నారు. విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆగ్రహించారు ఏబీ వెంకటేశ్వరరావు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. మేము చూపించిన ఆధారాలు తప్పు అని నిరూపిస్తే.. చెంపలు వేసుకుంటామని పేర్కొన్నారు ఏబీ వెంకటేశ్వరరావు. మావి తప్పుడు ఆధారాలు అయితే.. వాస్తవాలు ఏంటో ప్రజలకి చెప్పాలని డిమాండ్ చేశారు ఏబీ వెంకటేశ్వర రావు.