ఇకపై పశువులకు కూడా హాస్టల్స్ నిర్మిస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. పశువులకు కావాల్సిన షెడ్లు కట్టించి అక్కడికే గడ్డి పంపిస్తామని వెల్లడించారు. ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…. ఎక్కడో రాజీవ్ గాంధీ హత్య జరిగితే మాచర్లలో రౌడీలు విధ్వంసం సృష్టించారన్నారు.

మొన్నటివరకు ఇక్కడ ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగలేదని మండిపడ్డారు. గతంలో మాచర్లకు వద్దామంటే నా ఇంటికి తాళ్లు కట్టి రానీయకుండా అడ్డుకున్నారన్నారు. అప్పుడే చెప్పాను నా ఇంటికి తాళ్లు కట్టి, మీ మెడకు ఉరితాళ్లు వేసుకుంటున్నారని…. ప్రవర్తన మార్చుకోకపోతే ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు.