నేటి నుంచి తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ పండుగ జరుగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎంగిలి పూల బతుకమ్మకు మహిళలు సిద్దం అయ్యారు. హన్మకొండలో జరిగే ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు మంత్రులు.

ఇలాంటి నేపథ్యంలోనే…కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కేసీఆర్ సొంతూరు చింతమడక నుంచే కవిత వార్ మొదలు పెట్టింది. ఇవాళ సిద్దిపేట జిల్లాకు కవిత వెళ్లనున్నారు. చింతమడకలో కవిత బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నారు.
అయితే…చింతమడక (సిద్దిపేట జిల్లా) అంటే తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇది మాజీ సీఎం కేసీఆర్ గారి సొంతూరు కావడం వల్ల ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా ఉంటుంది. ఈరోజు అక్కడ కవిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. హరీష్‌రావు నియోజకవర్గం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.