ఏదో శక్తి పిలుస్తోంది వెళ్తున్నాస..అంటూ చెరువులో దూకి ఓ ప్రముఖ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు ఏదో జరుగుతోందని భయంతో సూసైడ్ చేసుకున్నాడు సురేందర్ అనే బ్యాంక్ మేనేజర్. తనపై క్షుద్రపూజలు జరిగాయని అనుమానంతో మంత్రగాళ్లను కలిసిన సురేందర్… బీబీనగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

వర్గల్ కు చెందిన సురేందర్ (36) తన భార్య పిల్లలతో కలిసి హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. ఇతను ఓ ప్రైవేట్ బ్యాంకులో పని చేస్తున్నారు. శుక్రవారం కుటుంబ సభ్యులకు చావు రమ్మంటుందని ఏదో శక్తి తనను పిలుస్తుందని నేను వెళుతున్నాను అంటూ ఆడియో రికార్డు చేసి దానిని తన కుటుంబ సభ్యులకు పంపిన అనంతరం ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడట. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అటు సురేందర్ మృతిపై స్పందించలేదు కుటుంబ సభ్యులు.
ఏదో శక్తి పిలుస్తోంది వెళ్తున్నా'.. చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య
తనకు ఏదో జరుగుతోందని భయంతో సూసైడ్ చేసుకున్న సురేందర్ అనే బ్యాంక్ మేనేజర్.
తనపై క్షుద్రపూజలు జరిగాయని అనుమానంతో మంత్రగాళ్లను కలిసిన సురేందర్.
బీబీనగర్ చెరువులో దూకి ఆత్మహత్య.
హన్మకొండ జిల్లా రాంనగర్‌కు… pic.twitter.com/9XnufJDJwc— ChotaNews App (@ChotaNewsApp) September 21, 2025