Rail Neer bottle: ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త. రైల్వే స్టేషన్లో రైళ్లలో విక్రయించే రైల్ నీర్ వాటర్ బాటిల్స్ ధరలు భారీగా తగ్గనున్నట్లుగా భారత రైల్వే సంస్థ వెల్లడించింది. లీటరు, అర లీటర్ వాటర్ బాటిల్ పై రూ. 1 తగ్గించినట్లుగా పేర్కొన్నారు దీంతో రైల్ నీర్ అర లీటర్ బాటిల్ ధర రూ. తొమ్మిది రూపాయలకు తగ్గింది.

లీటర్ బాటిల్ ధర రూ. 14గా ఉన్నట్లు తెలిపారు. రైల్వే బోర్డు ఐఆర్సిటిసికి అన్ని జోనల్ కార్యాలయాలకు సర్క్యులర్ జారీ చేసింది. ఇదిలా ఉండగా… ప్రయాణాల సమయంలో చాలామంది వాటర్ బాటిల్స్ కొనుగోలు చేస్తారు. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ వాటర్ బాటిల్స్ కొనుక్కుంటారు. ఈ నేపథ్యంలోనే అధికారులు రైల్ నీర్ ధరను తగ్గించింది. దీంతో ప్రయాణికులు ఈ వాటర్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రయాణికులకు కొంత మేరకు అయినా భారం తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.