ఈ ఏడాది దీపావళి నిజంగా ఏ తేదీ? తెలుసుకోండి!

-

వెలుగుల పండుగ దీపావళి అంటే మనసు ఉప్పొంగుతుంది. కొత్త బట్టలు, పిండివంటలు టపాసులు లక్ష్మీ పూజలతో ప్రతి ఇల్లు పండుగ శోభను సంతరించుకుంటుంది.చిన్న పెద్ద తేడా లేకుండా ఈ పండుగను అందరు జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం దీపావళిని ఏ తేదీన జరుపుకోవాలనే చిన్న సందేహం చాలా మందికి ఉంది. ఆ సందేహాన్ని తీరుస్తూనే, చీకటిని తరిమేసి వెలుగును నింపే ఈ పండుగ వెనుక ఉన్న గొప్ప విశిష్టత ఏంటో తెలుసుకుందాం.

2025 దీపావళి, సరైన తేదీ ఏది: హిందూ పంచాంగం ప్రకారం దీపావళి పండుగను ఆశ్వయుజ అమావాస్య రోజున జరుపుకుంటారు. అమావాస్య తిథి ప్రారంభం ముగింపు సమయాల్లో వచ్చే తేడాల వల్ల కొన్నిసార్లు తేదీ విషయంలో సందిగ్ధత ఏర్పడుతుంది. పండితులు, వివిధ పంచాంగాల ప్రకారం, 2025 సంవత్సరంలో దీపావళి పండుగ ముఖ్యమైన రోజు అంటే లక్ష్మీ పూజ ఆచరించే రోజు అక్టోబర్ 20, సోమవారం. ఆశ్వయుజ అమావాస్య తిథి అక్టోబర్ 20న ప్రారంభమై, అక్టోబర్ 21న ముగుస్తుంది. అయితే లక్ష్మీ పూజకు అత్యంత శుభప్రదమైన ప్రదోష కాలం అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం వేళలో ఉంటుంది కాబట్టి ఆ రోజే దీపావళిని జరుపుకోవడం శ్రేయస్కరం అని పండితులు తెలుపుతున్నారు.

What’s the date of Diwali this year?
What’s the date of Diwali this year?

ముఖ్యమైన  దీపావళి వేడుక తేదీలు: ధన త్రయోదశి (ధనతేరాస్) అక్టోబర్ 18న శనివారం నిర్వహిస్తారు. నరక చతుర్దశి (చోటి దీపావళి), అక్టోబర్ 19న ఆదివారం నాడు జరుపుకుంటారు. దీపావళి (లక్ష్మీ పూజ): అక్టోబర్ 20, సోమవారంనాడు నిర్వహిస్తారు. గోవర్ధన పూజ అక్టోబర్ 21న మంగళవారం కొన్ని ప్రదేశాలలో చేస్తారు.ఇక దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించుకోవడం కాదు, అదొక గొప్ప విజయాన్ని ఆధ్యాత్మిక సందేశాన్ని సూచిస్తుంది.

చీకటిపై వెలుగు విజయం: ఈ పండుగ గురించి రెండు ముఖ్యమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది, శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో రాక్షసుడైన నరకాసురుడిని సంహరించినందుకు ప్రజలు సంతోషంతో దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు. అందుకే దీపావళికి ముందు రోజును నరక చతుర్దశి అంటారు. రెండవది, 14 సంవత్సరాల వనవాసం తరువాత శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు, ప్రజలు దీపాలతో స్వాగతం పలికారు. ఈ రెండు కథలూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని నిలబెడతాయి.

సిరి సంపదలకు స్వాగతం (లక్ష్మీ పూజ): దీపావళి రోజున సాయంత్రం వేళ లక్ష్మీదేవిని పూజించడం ఒక ముఖ్యమైన ఆచారం. అమావాస్య చీకట్లో లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తుందని నమ్ముతారు. అందుకే ఇల్లంతా దీపాలతో అలంకరించి, లక్ష్మీదేవిని ఆహ్వానించడం ద్వారా సంపద, శ్రేయస్సు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. దీపాలు కేవలం భౌతిక కాంతిని మాత్రమే కాక, మన జీవితాల్లోని అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానం అనే వెలుగును నింపుతాయని కూడా ఈ పండుగ తెలియజేస్తుంది.

దీపావళి పండుగ మన సంస్కృతిలో ఒక ఆనందమయ ఘట్టం. ఈ పండుగ కేవలం పటాకులు కాల్చి మిఠాయిలు తినే వేడుక మాత్రమే కాదు, మన జీవితాల్లోని ప్రతికూలతలను తొలగించుకుని, కొత్త ఆశలు వెలుగులతో ముందడుగు వేయమని చెప్పే గొప్ప సందేశం.

గమనిక: పండుగ తేదీలు ప్రాంతాలను బట్టి, పంచాంగాలను బట్టి స్వల్పంగా మారే అవకాశం ఉంది. మీ ప్రాంతంలోని పండితుల సలహా మేరకు తుది తేదీని నిర్ధారించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news