కొవ్వు అంటే మన ఆరోగ్యానికి హానికరమైనదిగానే చూస్తాం కదా? కానీ మన శరీరంలో ఉండే ఒక రకమైన ‘మంచి కొవ్వు’ (Brown Fat) గురించి మీకు తెలుసా? దీని ప్రత్యేకత ఏంటంటే ఇది చలి తగిలినప్పుడు యాక్టివ్ అయ్యి మన శరీరంలోని చెడు కొవ్వు (White Fat)ను కరిగిస్తుంది! అదెలా పనిచేస్తుంది? అసలు ఈ బ్రౌన్ ఫ్యాట్ మన ఆరోగ్యానికి ఇంత కీలకం ఎందుకు? బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఎలా సహాయపడుతుందో వివరంగా తెలుసుకుందాం.
వైట్ ఫ్యాట్ (White Fat):మన శరీరంలో రెండు రకాల కొవ్వులు ప్రధానంగా ఉంటాయి.ఇక వైట్ ఫ్యాట్ దీనినే సాధారణ కొవ్వు అంటారు. ఇది శక్తిని నిల్వ చేస్తుంది మరియు అధికంగా ఉంటే స్థూలకాయానికి దారితీస్తుంది.
బ్రౌన్ ఫ్యాట్ (Brown Fat): దీనినే బ్రౌన్ ఎడిపోస్ టిష్యూ అని కూడా అంటారు. ఇది చాలా ప్రత్యేకమైనది. దీనిలో అధిక సంఖ్యలో మైటోకాండ్రియా (శక్తి కేంద్రాలు) ఉంటాయి అందుకే దీనికి ఆ రంగు వచ్చింది.

బ్రౌన్ ఫ్యాట్ ఎలా పనిచేస్తుంది?: బ్రౌన్ ఫ్యాట్ ప్రధాన విధి శక్తిని నిల్వ చేయడం కాదు దాన్ని ఉపయోగించి వేడిని ఉత్పత్తి చేయడం. మనం చల్లటి వాతావరణంలో ఉన్నప్పుడు ఈ బ్రౌన్ ఫ్యాట్ యాక్టివేట్ అవుతుంది. ఇది తెల్ల కొవ్వు మరియు ఇతర శక్తి నిల్వలను తగులబెట్టి శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఈ ప్రక్రియను నాన్-షివరింగ్ థర్మోజెనిసిస్ అంటారు.
మన ఆరోగ్యానికి ఎంత కీలకం: బరువు నియంత్రణ, ఇది అదనపు కొవ్వును, కేలరీలను తగులబెడుతుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి లేదా స్థూలకాయాన్ని నియంత్రించాలనుకునే వారికి ఇది ఒక సహజమైన మార్గం.
మధుమేహం నియంత్రణ: ఈ కొవ్వు గ్లూకోజ్‌ను (చక్కెర) కూడా శక్తి కోసం ఉపయోగిస్తుంది. దీని కారణంగా బ్లడ్ షుగర్ స్థాయిలు మెరుగవుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
మెరుగైన జీవక్రియ: బ్రౌన్ ఫ్యాట్ యాక్టివ్‌గా ఉండటం అనేది మొత్తం శరీర జీవక్రియను వేగవంతం చేస్తుంది.
దీనిని యాక్టివేట్ చేయడానికి చల్లటి నీటితో స్నానం చేయడం లేదా చల్లటి వాతావరణంలో కాసేపు ఉండటం వంటివి కొందరు నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
బ్రౌన్ ఫ్యాట్ అనేది మన శరీరానికి లభించిన ఒక సహజ వరం లాంటిది. చెడు కొవ్వును తగులబెట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఈ అద్భుతమైన యంత్రాంగాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
గమనిక: బ్రౌన్ ఫ్యాట్‌ను యాక్టివేట్ చేయడానికి ప్రయత్నించే ముందు మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుడిని లేదా ఫిట్నెస్ నిపుణుడిని సంప్రదించడం మంచిది.