వైద్యులను గౌరవించండి…!

-

ఈ సృష్టిలో ఇప్పుడు వైద్యుడే దేవుడు అనేది చాలా మందికి స్పష్టంగా అర్ధమవుతుంది. కరోనా వైరస్ మీద వైద్యులు చాలా తీవ్రంగా పోరాడుతున్నారు. చెప్పుకోలేక వాళ్ళు ఇప్పుడు నరక యాతన అనుభవిస్తున్నారు. కాసేపు మొహానికి కళ్ళ జోడు పెట్టుకుంటేనే చిరాకు గా ఉంటుంది. అలాంటిది గంటల కొద్దీ మాస్క్ లు పెట్టుకుని, సూట్ వేసుకుని కనపడుతున్నారు. ప్రాణాలకు తెగించి వాళ్ళు సేవలు అందిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు అందరూ కరోనా మీద పోరాటం చేస్తున్నారు. వాళ్ళు కుటుంబాలను వదిలి ఆస్పత్రుల్లోనే ఉంటున్నారు. ఇటలీ అమెరికా, స్పెయిన్ సహా పలు దేశాల్లో ఇప్పుడు కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. అక్కడ కట్టడి చేయడం అనేది ప్రభుత్వాలకు ఏ విధంగా సాధ్యం కావడం లేదు. ఇప్పుడు కరోన వైరస్ సోకి వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వందల మంది డాక్టర్లు ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రతకు ప్రాణాలు కోల్పోయారు.

ఇటలీలో 50 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలకు ఇప్పుడు ఒకటే సూచన… దయచేసి ప్రజలు అందరూ కూడా వైద్యులను గౌరవించండి. వైద్యులు ఇప్పుడు మనకు ప్రాణ దాతలు… వారు అందరూ లేకపోతే మనకు జీవితాలు లేవు. దయచేసి అందరూ కూడా వైద్యుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రవర్తించండి. వాళ్ళను ఇల్లు ఖాళీ చేయమని అనడం గాని వాళ్ళను డబ్బుల దగ్గర ఇబ్బంది పెట్టడం గానీ దయచేసి చేయకండి.

Read more RELATED
Recommended to you

Latest news