భయపెట్టడం కాదు నిజం; కరోనా ఉగ్రరూపం…!

-

అవును ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. అన్ని దేశాలను ఈ కరోనా మహమ్మారి ఇప్పుడు అత్యంత హేయంగా కమ్మేసింది. జాలి దయా, చిన్నా, పెద్దా, ముసలి ముతక అనే తేడా లేకుండా కరోనా వైరస్ ఇప్పుడు విలయతాండవం చేస్తుంది. కరోనా సోకని దేశం లేదు ప్రపంచంలో. కరోనా మరణం లేని దేశం లేదు ప్రపంచం లేదు. ఇప్పుడు ఇది మరింత రెచ్చిపోతుంది. తగ్గినట్టే తగ్గి చెలరేగిపోతుంది కరోనా.

ప్రస్తుతం 783277 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 164753 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. మరణాల సంఖ్య 37744గా ఉంది. నిన్న ఒక్క రోజే కరోనా కారణంగా 3,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో కొత్తగా 4050 కేసులు నమోదవడంతో.. మొత్తం కేసులు 101739 అయ్యాయి. కొత్తగా 812 మంది చనిపోవడంతో… మృతుల సంఖ్య 11591 అయ్యింది.

స్పెయిన్ లో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. సోమవారం 7846 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య… 87956కి చేరుకుంది. సోమవారం 913 మంది చనిపోయారు. దీనితో మొత్తం మరణాలు 7716కి చేరుకుంది. ఇండియాలో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం… మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1251 గా ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కరోనా బారిన పడిన వారి సంఖ్య… తెలంగాణాలో 70 ఆంధ్రప్రదేశ్ లో 23 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news