ఆంధ్రా బ్యాంకు… తెలుగు వాళ్ళు అందరికి ఈ బ్యాంకు గురించి తెలిసే ఉంటుంది. దాదాపు వంద ఏళ్ళ చరిత్ర ఉన్న బ్యాంకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎందరికో సుపరిచితం. ఎకౌంటు ఉంటే ఆంధ్రా బ్యాంకు, లేకపోతే స్టేట్ బ్యాంకు… ఈ రెండు బ్యాంకుల తర్వాతే మన రాష్ట్రాల్లో ఏ బ్యాంకు అయినా సరే. ఆంధ్రా బ్యాంకు ప్రభుత్వ ఉద్యోగులకు, రైతులకు ఎందరికో సుపరిచితం… ఖాతాలు చాలా మంది ఓపెన్ చేసి ఉంటారు.
బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఆంధ్రా బ్యాంక్ విలీనం అయిపోతుంది. బుధవారం నుంచి ఈ బ్యాంక్ ఉండదు ఇక. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో 1923లో లక్ష రూపాయల మూలధనంతో ఈ బ్యాంక్ ని స్థాపించారు. దేశ విదేశాల్లో దీని శాఖలు ఉన్నాయి. ఆ లోగో కూడా చాలా మందికి సుపరిచాతం. ఈ బ్యాంకు బుధవారం యూనియన్ బ్యాంకులో విలీనం అవుతుంది.
ఆంధ్రాబ్యాంకుతో పాటు కార్పొరేషన్ బ్యాంకు కూడా యూనియన్ బ్యాంక్‌లో విలీనం కానుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్-OBC, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-UBI విలీనం అవుతాయి. కెనెరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్ విలీనం అవుతుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ అవుతాయి. ఇండియన్ బ్యాంకులో అలాహాబాద్ బ్యాంక్ విలీనం అవుతాయి. ఇక నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12 కి తగ్గుతుంది.