గంటలో గదిలోని వైరస్‌లు ఖతం..!

-

ముంబై : ప్రస్తుతం కరోనా మహమ్మారిపై పోరు చేస్తున్న వేళ.. ఓ అంకుర సంస్థ ఆస్పత్రులను ఇన్‌ఫెక్షన్ రహితంగా మార్చగల యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. కూలర్ మాదిరిగా పనిచేసే ఈ యంత్రాన్ని పుణెకు చెందిన అంకుర సంస్ధ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్(ఎస్టీపీ) తయారు చేసింది. దీనికి ‘సైటెక్ ఎయిర్ఆన్’ అని నామకరణం చేశారు. గంటల వ్యవధిలోనే గదుల్లో ఉండే వైరస్, బ్యాక్టిరీయా, ఇతర క్రిములను ఇది నిర్మూలిస్తుంది. ఈ యంత్రం నుండి వెలువడే నెగిటివ్ ఆయాన్లు వైరస్‌లను నిర్వీర్యం చేసి గదుల్లోని గాలిని శుభ్రపరుస్తాయి.

ఈ సైటెక్ ఎయిర్ఆన్ యంత్రాన్ని కరోనా చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల్లో వైరల్ లోడ్ తగ్గించడానికి వాడతామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ(డీఎస్టీ) సోమవారం తెలిపింది. వీటి ఉత్పత్తి కోసం కోటి రూపాయలు కేటాయిస్తున్నట్ట వెల్లడించింది. త్వరలోనే మహారాష్ట్రలోని ఆస్పత్రుల్లో వైరల్ లోడ్ తగ్గించడానికి ఈ యంత్రాలను అమర్చనున్నట్ట పేర్కొంది. విశ్రాంతి లేకుండా కరోనా వైరస్ బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు, నర్సులకు మరింత సమర్థవంతంగా కరోనాపై పోరాడేందకు అవసరమైన వాతావరణాన్ని ఈ యంత్రం కల్పిస్తుందని ధీమా వ్యక్తం చేసింది.

దీని ధర రూ. 40,000 ఉందని, ఇది 99.7 శాతం మేర ఒక గదిలోని వైరల్ లోడ్ తగ్గిస్తుందని ఎస్టీపీ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర తెలిపారు. ఈ యంత్రం 8 సెకన్లలో 100 మిలియన్ నెగిటివ్ ఆయాన్లను విడుదల చేస్తుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news