వంద కోట్ల సహాయం చేసిన ఎయిర్టెల్… ఎలానో చూడండి…!

-

దేశంలో వలస కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడిక్కడ కరోనా దెబ్బకు కూలీల చేతుల్లో రూపాయి కూడా లేకుండా పోయింది. కనీసం తినడానికి తిండి కూడా లేకుండా పోయింది చాలా మందికి. వేలాది మంది కూలీలు రోడ్డు మీద నడుచుకుంటూ వందల కిలోమీటర్లు నడుస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే ఇప్పుడు వలస కూలీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

ఈ నేపధ్యంలో వారికి సహాయం చేయడానికి ఎయిర్టెల్ ముందుకి వచ్చింది. సుమారు 8 కోట్ల మంది యూజర్లకు ప్రతీ ఒక్కరి అకౌంట్‌లోకి రూ.10 జమ చేయనుంది. కాల్స్, మెసేజెస్ చేయడానికి వీటిని వాడుకునే అవకాశం కల్పించింది. 8 కోట్ల మంది ప్రీపెయిడ్ యూజర్లకు కాల పరిమితి కూడా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుది. లాక్‌డౌన్ సమయంలో వేలిడిటీ పూర్తై ఇబ్బందులు పడకూడదు అని భావించిన సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

మరో 48 గంటల్లో ఈ బెనిఫిట్స్ యూజర్ల అకౌంట్లలో ఈ డబ్బులు జమ కానున్నాయి. అంటే దాదాపు ఎయిర్టెల్ నేరుగా 80 కోట్ల సహాయం చేసింది. పది రూపాయల టాక్ టైం మనకు రావాలి అంటే కనీసం 15 రూపాయలు రీచార్జ్ చేసుకోవాలి. పది రూపాయాల కార్డ్ వేస్తే మూడు రూపాయల వరకు కట్ అయి మన ఖాతాలోకి 7 రూపాయలు మాత్రమే వస్తాయి. అంటే దాదాపు ఇప్పుడు ఎయిర్టెల్ వంద కోట్ల సహాయం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news