గర్భధారణ సమయంలో తల్లికి, బిడ్డకు మధ్య రక్షణ కవచంలా పనిచేసే ‘ఉమ్మ నీరు’ (Amniotic Fluid) సరైన స్థాయిలో ఉండటం చాలా ముఖ్యం. ఇది శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, సులభంగా కదలడానికి సహాయపడుతుంది. ఈ నీటి శాతం కొద్దిగా తగ్గినా, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని సహజమైన, ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకుంటేనే ఉమ్మ నీరు సహజంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..
హైడ్రేషన్ కీలకం: నీరు మరియు కొబ్బరి నీరు, ఉమ్మ నీరు పెరగడానికి అత్యంత ముఖ్యమైన మరియు సులువైన మార్గం శరీరంలో ‘హైడ్రేషన్’ (Dehydration) స్థాయిలను పెంచడం. గర్భిణీ స్త్రీలు రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి. కేవలం నీరు మాత్రమే కాదు ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉండే కొబ్బరి నీరు అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరి నీరు శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు, ఉమ్మ నీరు వృద్ధి చెందడానికి సహాయపడుతుందని వైద్యులు కూడా సిఫార్సు చేస్తారు. డీహైడ్రేషన్ సమస్యను నివారిస్తూ ఉమ్మ నీటిని పెంచడంలో కొబ్బరి నీరు కీలక పాత్ర పోషిస్తుంది.

పండ్ల రసాలు మరియు కూరగాయల సూప్‌లు: నీరు ఎక్కువగా ఉండే తాజా పండ్ల రసాలు కూడా ఉమ్మ నీటి స్థాయిలను వేగంగా పెంచుతాయి. ముఖ్యంగా పుచ్చకాయ రసం, నిమ్మరసం, దానిమ్మ రసం, నారింజ రసం వంటివి మంచి ఎంపికలు. ఈ పండ్లలోని నీటి శాతం, విటమిన్లు తల్లికి, బిడ్డకు పోషణను అందిస్తాయి. అలాగే కీరా, క్యారెట్, టొమాటో, ఆకుకూరలతో చేసిన వెజిటబుల్ సూప్‌లు తాగడం వలన ద్రవంతో పాటు విటమిన్లు కూడా శరీరానికి అందుతాయి. చల్లటి పానీయాలకు బదులు వెచ్చగా ఉండే తక్కువ ఉప్పుతో చేసిన ఈ సూప్‌లు ఎంతో మేలు చేస్తాయి.
ఉమ్మ నీరు సహజంగా పెరగాలంటే ఆహారంలో సరైన ద్రవాలను చేర్చుకోవడంతో పాటు సరిపడా విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరం. సరైన హైడ్రేషన్, పౌష్టికాహారం, వైద్యుల సలహాలు పాటిస్తే మీ బిడ్డ గర్భంలో సురక్షితంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.
గమనిక: ఉమ్మ నీరు తగ్గడం అనేది ఒక వైద్యపరమైన అంశం. ఇంట్లోనే సహజ పద్ధతులు ప్రయత్నించే ముందు మీ గైనకాలజిస్ట్‌ను తప్పనిసరిగా సంప్రదించి, వారి సలహా మేరకే ఆహారంలో మార్పులు చేసుకోండి.
