2026… జీరో సంవత్సరమట.. ఎందుకో తెలుసా?

-

జీరో సంవత్సరమేంది.. 2026 ఏంది.. ఏంటి మ్యాటర్ అసలు అంటారా? 2026 వ సంవత్సరం వరకు ఈ ప్రపంచంలో ఉన్న జంతువులన్నింటిలో ఒక్క మనిషికి తప్ప మిగితా జీవరాశులన్నీ తమ సహజసిద్ధమైన ప్రాంతాలను కోల్పోబోతున్నాయి. అది సంగతి. అంటే వాటి మనుగడ రోజురోజుకూ కష్టమైపోతున్నది. కేవలం ఇంకో ఎనిమిదేళ్లలోనే ఇదంతా జరగనుంది. 2026 లోపు అన్నమాట. అందుకే 2026 ను సైంటిస్టులు జీరో ఇయర్ గా ప్రకటించబోతున్నారు.

బయో డైవర్సిటీకి తీరని దెబ్బ పడుతున్నది. దీనికి కారణం వంద శాతం మనుషులు. అవును.. మనుషులే జీవరాశుల ఆవాసాలపై దెబ్బ కొడుతున్నాడు. వాటిని నాశనం చేస్తున్నారు. ఎక్కడ చూసినా కాలుష్యమే. ఆ కాలుష్యమే వాటి ఆవాసాలను దెబ్బ తీస్తోంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఆవాసాలు 2026 తర్వాత కనిపించవు. కాకపోతే మానవుడు సృష్టించే ఆవాసాలు ఎప్పటికీ ఉంటాయి. అడవులు, ఎడారులు, చెరువులు, వాగులు, వంకలు, గడ్డి భూములు.. ఇలా సహజ సిద్ధంగా ప్రకృతి ఏర్పరుచుకున్న ఏదైనా జంతుజాలానికి ఆవాసమే. కానీ.. మనిషి తన స్వార్థం కోసం.. తన అవసరం కోసం ప్రకృతి నాశనం చేసేస్తున్నాడు.

జంతువులకు నీడ లేకుండా చేస్తున్నాడు. దీంతో రోజు రోజుకూ జంతువులు నిలువ నీడలేక అల్లాడిపోతున్నాయి. 1970 నుంచి 2010 సంవత్సరం వరకు పరిగణనలోకి తీసుకుంటే సగానికి పైగా జంతువులు తమ ఆవాసాలను కోల్పోయాయి. 2014 లో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనే సంస్థ తేల్చిన నిజాలు అవి. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం కావచ్చు.. గ్లోబల్ వార్మింగ్ కావచ్చు.. మనిషి స్వార్థం కావచ్చు.. ఏదైనా కావచ్చు.. ఇవన్నీ జంతువుల ఆవాసాలకు గండి కొడుతున్నాయి. అందుకే అవి ఒంటరివైపోతున్నాయి. అంతే కాదు.. వాటి ఆవాసాలతో పాటు అవి కూడా త్వరలోనే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మానవజాతి మేల్కొని వాటిని కాపాడుకుంటేనే ఈ ప్రపంచంలో జీవవైవిధ్యం బతికుంటుంది. ఒకసారి జీవవైవిధ్యం నాశనమైతే ప్రపంచంలో మానవ జాతి కూడా అంతమైనట్టే. అంటే.. మన చేతులారా మనమే మన నాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నాము.

Read more RELATED
Recommended to you

Latest news