ఈ రోజుల్లో అన్నిటిలో కల్తి ఎక్కువగా ఉండటం వల్ల మనం తినే ఆహారంలో పోషక విలువలు నశిస్తున్నాయి. ఈ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మరియు మనం తెలిసి తెలియక కొన్ని విషయాల మీద అవగాహన లేకపోవడం వల్ల అనేక అపోహలు పెంచుకుంటాము. ఈ చిట్కాలు గుర్తుంచుకుంటే అపోహలన్ని దూరం అవుతాయి.
మనం వంటకు వాడే ఆయిల్ తో గుండె ఆరోగ్యం ముడిపడి ఉంది. ఆలివ్ ఆయిల్ కి గుండె ఆరోగ్యాన్ని పెంచే శక్తి ఉంది. ప్రతి రోజు ఈ ఆయిల్ ని వంటలో ఉపయోగించడం వల్ల కరోనరీ ఆర్టరీ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. కాస్త దగ్గు రాగానే అందరు మందుల షాపుకి వెళ్లి దగ్గు మందు తెచ్చుకుని వేసుకోవడం అలవాటు. కాని అలా తెచ్చుకున్న మందుల్లో చాలా వరకు పని చేయవని వైద్యులే అంగీకరిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా తగ్గించాలి. మనం వాడే టూత్ పేస్ట్ లు పళ్ళను మెరిపిస్తాయి అని ప్రచారం చేసేవన్నీ అంత ప్రభావంతంగా పనిచేయవు. మామూలు వాటికన్నా ఇవి ఆరోగ్యానికి హానికరం అని గుర్తుంచుకోవాలి.
గుండె ఆరోగ్యం కోసం వాకింగ్, రన్నింగ్ లో ఏదైనా చేయవచ్చు. ఇవి రెండు సమాన ఫలితాన్ని ఇస్తాయి. ఎక్కువ సమయం టివి చూడడం వలన కంటి చూపు దెబ్బ తింటుందని చాలా మందిలో అపోహ ఉంటుంది. కాని టివి చూడటం వల్ల చూపు దెబ్బ తినదు. కళ్ళకు అలసటగా అనిపిస్తే కాస్త విరామం తీసుకుంటే మంచిది. నట్స్ తింటే ఒల్లు పెరుగుతుంది అని చాలా మంది పోషకాలు ఉన్న నట్స్ దూరం పెడతారు. కాని మరి శ్రుతి మించి తింటే తప్ప బరువు పెరగదు. ఇంకా ఇవి చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి.