తెలంగాణా సంచలన నిర్ణయం… ఇక అవి తప్పనిసరి…!

-

తెలంగాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జనాలు బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఇళ్ల నుంచి బయటకు వస్తే కచ్చితంగా మాస్క్‌లు వాడాలని తెలంగాణా సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వైరస్‌ సోకినా చాలా మందికి లక్షణాలు కనబడవని, అలాంటివారు కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.

కరోనా రాకుండా ఉండాలి అంటే రక్షణ చర్యలు చాలా అవసరమని అధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. అందరూ కూడా మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు ఇచ్చింది. ఆఫీసులు, పని చేసే ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ఉపయోగించాలని ఉత్తర్వుల్లో వివరించింది. అదే విధంగా రెండు పొరలు ఉన్న కాటన్‌ వస్త్రాన్ని కూడా వాడొచ్చని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు అందరూ కూడా మాస్క్ వాడాల్సిందే అని స్పష్ట౦ చేసింది. మూతి, ముక్కు, గడ్డం పూర్తిగా కప్పేలా మాస్క్‌ ధరించాలని అధికార ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కుని మాస్క్‌ వేసుకోవాలని సూచించింది. మాస్క్‌లు ఒకసారే వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం వాషబుల్‌ మాస్క్‌లు ధరించడం మేలని ప్రభుత్వం సలహా ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news