షాకింగ్; కరోనా వచ్చిన వాళ్ళకే మళ్ళీ, ఈ కేసులు పెరుగుతున్నాయి…!

-

ఇదేంటి రా బాబు ఇలా తగులుకుంది… ప్రపంచం మొత్తం నెత్తిన చేతులు పెట్టుకుని కన్నీళ్లు పెడుతున్న సందర్భం ఇదే. కరోనా ఏ మూల నుంచి వస్తుందో తెలియదు, అది ఎలా దాడి చేస్తుందో తెలియదు, వచ్చిందో లేదో తెలియదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా తెలియని అభద్రతా భావంలో బ్రతుకుతుంది. చరిత్ర చూడని విపత్తుని ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదుర్కొంటుంది. రెండో ప్రపంచం యుద్ధం నాటికంటే పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి

కరోనా వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా 17 లక్షల మందికి సోకింది. వీరిలో దాదాపు లక్షా 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 వేల మంది అటు ఇటూ గా ఉన్నారు. ఇక దాదాపు నాలుగు లక్షల మంది వ్యాధి నుంచి పూర్తిగా బయటపడ్డారు. అంత వరకు బాగానే ఉంది గాని… ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచానికి కొత్త సమస్యను తీసుకొచ్చింది. ఊహించని విధంగా మళ్ళీ ఎటాక్ చేస్తుంది.

కరోనా ఒకసారి వస్తే మళ్ళీ రాదు అనేది వైద్యుల నమ్మకం. కాని అది రెండో సారి కూడా వస్తుంది. కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న దాదాపు వంద మందికి ఈ వైరస్ మళ్ళీ వచ్చింది. ముందు 200 మందిని పరిక్షలు చేయగా అందులో 51 మందికి పాజిటివ్ వచ్చింది దక్షిణ కొరియాలో. ఇప్పుడు ఆ సంఖ్య 91 కి చేరుకుంది. వీరిలో ముగ్గురు కోలుకుని మళ్ళీ వ్యాధి రావడంతో చనిపోయారు.

ఆ దేశంలో పూర్తిగా 7 వేల మందికి వ్యాధి తగ్గిపోయింది. డాక్టర్ల అంచనా ఏంటీ అంటే… కరోనా వైరస్ నుంచి బయటపడిన వారిలో రోగ నిరోధక శక్తి పెరిగి మళ్ళీ వ్యాధి సోకే అవకాశం ఉండదు అని. కాని ఇలా మళ్ళీ వ్యాధి నుంచి బయట పడిన వారికి కూడా రావడం తో పరీక్షలను వేగవంతం చేస్తున్నారు. దీనితో ఇప్పుడు దక్షిణ కొరియా అప్రమత్తం అవుతుంది. లాక్ డౌన్ విధించే యోచనలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news