మద్యం పిచ్చితో శానిటైజర్ తాగి చచ్చిపోయాడు…!

-

కరోనా లాక్ డౌన్ ఏమో గాని ఇప్పుడు జనాలకు మధ్య దొరకక పిచ్చి ఎక్కే పరిస్థితి ఏర్పడింది. మద్యపానానికి బానిసైన కొందరు వ్యక్తులు తమకు అందుబాటులో ఏది ఉంటే దాన్ని తాగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పెనాయిల్ తాగడం సహా డెటాల్ వంటి వాటిని కల్లు మాదిరి తయారు చేసుకుని తాగుతున్నారు. తాజాగా తమిళనాడు లో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. మద్యం పిచ్చితో శానిటైజర్ తాగాడు ఒక వ్యక్తి.

వివరాల్లోకి వెళితే పోలీసుల సమాచారం ప్రకారం తమిళనాడు లోని కోయంబత్తూర్ సమీపంలోని సిరువాని ట్యాంక్ రోడ్‌కు చెందిన ఇ బెర్నార్డ్‌ ఎల్పిజి సిలిండర్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు… అతను కొన్నాళ్ళుగా మద్యానికి బానిస అయ్యాడు. రెండు రోజుల క్రితం, అతని యజమాని అతనికి ఒక బాటిల్ హ్యాండ్ శానిటైజర్ ఇచ్చి, కోవిడ్ -19 వ్యాప్తి చెందకుండా వాడమని సలహా ఇచ్చాడు.

లాక్డౌన్ కారణంగా మద్యం కొనలేని బెర్నార్డ్, ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌లో కొంత నీరు కలిపి తాగాడు. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడ్డాడు. వెంటనే అక్కడి నుంచి అతన్ని కోయంబత్తూర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (సిఎంసిహెచ్) కు తరలించారు. కానీ అప్పటికే అతని ఆరోగ్యం క్షీణించడం తో ప్రాణాలు కోల్పోయాడు. అతనికి భార్యా ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news