బిగ్ బాస్ హోస్ట్ గా మరోసారి అలరించబోతున్న యంగ్ టైగర్ …!

-

 

భాతర దేశంలోనే అతి పెద్ద రియాలిటి షో బిగ్ బాస్. ఈ రియాలిటి షో ప్రపంచవ్యాప్తంగా బుల్లి తెర వీక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. హిందీ, తమిళం, తెలుగు లో స్టార్ హీరోలు హొస్ట్ వ్యవహరిస్తున్న ఈ రియాలిటి షో కి సినిమా కంటే పాపులారిటి దక్కడం గొప్ప విషయం. ప్రతీ సీజన్ లో భాష ఏదైనా కాంట్రవర్సీలతో హాట్ హాట్ గా సాగే ఈ రియాలిటీ షో లో కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఏం చెప్పినా చేయాల్సిందేనన్న నిబంధనలు షో లోకి ఎంటరవక ముందే కమిటవుతారు.

 

ఇక ఈ షోని హిందీలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్, తమిళం లో కమల్ హాసన్ విజయవంతగా నిర్వహిస్తుండగా తెలుగులో మాత్రం ప్రతీ సీజన్ కి మన టాలీవుడ్ స్టార్ హీరోలు మారుతూ రావడం ఆసక్తికరమైన విషయం. మొదటి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పూనే కి దగ్గర్లో వేసిన భారీ సెట్ లో బిగ్ బాస్ సీజన్ 1 ని నిర్వహించారు. ఆ సమయంలో ఎన్.టి.ఆర్ జై లవ కుశ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటుంగ్ దాదాపు అదే ప్రాంతంలో జరిగింది. అందుకే బిగ్ బాస్ హూజ్ సెట్ ని అక్కడ వేశారు. ఈ సీజన్ సూపర్ సక్సస్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించినందుకు ఎన్.టి.ఆర్ రెమ్యూనరేషన్ 6.5 కోట్లు అందినట్టు సమాచారం.

 

ఇక బిగ్ బాస్ సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. హైదరాబాద్ లో వేసిన బిగ్ బాస్ సీజన్ 2 హౌజ్ కూడా సక్సస్ ఫుల్ గా సాగింది. కాని నాని ఎన్.టి.ఆర్ లా మాత్రం మెప్పించలేకపోయాడన్న విమర్శలు వచ్చాయి. అయితే 5-6 వారాల తర్వాత నెమ్మదిగా నాని ఫాం లోకి వచ్చాడు. ఓవరాల్ గా సీజన్ 2 ని సక్సస్ చేశాడు. ఇక సీజన్ 2 కి నాని రెమ్యూనరేషన్ 3.5 కోట్లు అందుకున్నాడట. ఇక సీజన్ 3 కి కింగ్ నాగార్జున హొస్ట్ గా వ్యవహరించి షో బాగా పాప్లర్ ఆయోలా చేశాడు. ఆల్రెడి మీలో ఎవరు కోటీశ్వరుడు కి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున కి బిగ్ బాస్ ఈజీగా హ్యాండిల్ చేశాడు.

అయితే ఇప్పటి వరకు ప్రసారమైన ఈ మూడు సీజన్స్ లో ఎన్.టి.ఆర్ హోస్ట్ చేసిన సీజన్ 1 కే విపరీతమైన పాపులారిటి… క్రేజ్ దక్కింది. దాంతో ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ తో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నాడు. అయితే ఇది కొత్త సీజన్ కాదు .. సీజన్ 1 నే మళ్ళీ రీ టైలికాస్ట్ చేయబోతున్నారు స్టార్ మా నిర్వాహకులు. అందుకు తగ్గ టెక్నికల్ కార్యక్రమాలని సిద్దం చేస్తున్నారు. త్వరలో ఎన్.టి.ఆర్ సీజన్ 1 ప్రసారం కాబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news