ఏపీలో రోడ్డు మీద ఉమ్ము వేస్తే క్రిమినల్ చర్యలు…!

-

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఏ విధంగా వ్యాపిస్తుందో ఎవరికి అర్ధం కాని పరిస్థితి. కరోనా వైరస్ సామాజిక దూరం పాటించినా సరే అది మాత్రం కట్టడి కావడం లేదు. దీనిపై ఇప్పుడు ప్రజల్లో చాలా భయాలు ఉన్నాయి. కొంత మంది చేసే పనులు ఇప్పుడు కరోనా వ్యాప్తిని రోజు రోజుకి పెంచుతున్నారు. దీనిపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో రోడ్ల పై ఉమ్ము వేయడాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధిస్తున్నాయి.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రోడ్డు మీద ఉమ్ము వేస్తే క్షమించే పరిస్థితి దాదాపుగా ఉండదు. ఇకపై పొగాకు ఉత్పత్తులు, నమిలే పొగాకు వంటివి వాడరాదని, పబ్లిక్‌లో అంటే రోడ్లపైనా ఎక్కడబడితే అక్కడ ఉమ్మివేయడాన్ని నిషేధిస్తున్నామంటూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. అంతే కాదు ఈ ఆదేశాలను ఎవరు అయినా ధిక్కరిస్తే… వారిపై 1860 ఐపీసీలోని క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం చర్యలుంటాయని పేర్కొంది.

ఇక వారికి భారీగా జరిమానా విధించే అవకాశాలు కూడా ఉంటాయని పేర్కొంటున్నారు. పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా, సుపారీ ఇలాంటివి తిన్నవారికి నోట్లో లాలా జాలం బయటకు వస్తుంది కాబట్టి వాటిని కూడా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఏపీలో కేసుల సంఖ్య 400 మార్క్ దాటింది.

Read more RELATED
Recommended to you

Latest news