స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కొత్త ఆర్డినెన్స్ తీసుకువచ్చి జగన్ ప్రభుత్వం పదవి నుండి తొలగించడం జరిగింది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది. కరోనా వైరస్ తో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుండి తొలగించడం ఏపీ మీడియా సర్కిల్ లో వైరల్ న్యూస్ గా మారింది. లోకల్ బాడీ ఎలక్షన్ల విషయంలో జగన్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేయడంతో …జగన్ సీరియస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబు డైరెక్షన్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేశారని, ఇద్దరి సామాజికవర్గం ఒకటే అని అప్పట్లో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తనని పదవి నుంచి తొలగించడం విషయంపై నిమ్మగడ్డ హైకోర్టుకు వెళ్లారు. జగన్ సర్కార్ తనని పదవి నుండి తొలగించటం విషయంలో చట్టబద్ధత లేదన్న పిటిషన్ కోర్టులో వేయడం జరిగింది. దీంతో ఈ విషయంలో కోర్టులో ఎవరు గెలుస్తారు అన్నది ఏపీ మీడియా సర్కిల్ లో, రాజకీయరంగంలో సంచలనంగా మారింది.
వీరిద్దరి వాదన కోర్టులో:
ఇక మేటర్ కోర్టులోకి వచ్చింది అనుకుంటే, నిమ్మగడ్డ వాదన కేవలం ఒక ఆట నుంచి తెచ్చి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి పదవీకాలం తగ్గించడం కుదరదు అని దీనిపై స్టే ఇవ్వాలని ఖచ్చితంగా నిమ్మగడ్డ కోరుతారు. దీనికి జగన్ ప్రభుత్వం ఆర్టికల్ 243(కె) ద్వారా తమకు ఉన్న “విచక్షణ అధికారాలను గుర్తు చేసే వీలుంది. తాము నిమ్మగడ్డని తొలగించలేదని.., పదవీకాలం తగ్గించామని… ఆయన పదవీకాలం ముగిసినందున ఆయనను తొలగించాల్సి వచ్చిందని సమాధానం చెప్పుకుంటుంది.
అయితే ఇదే విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కులంతో పాటు రాజకీయ కక్ష ధోరణితో అంతకుముందు వ్యాఖ్యలు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకు వచ్చే అవకాశం ఉంది. మరి ఇదే టైములో జగన్ సర్కార్…ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా ఎలా వేస్తారు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఒకవేళ ఇదే టైమ్ లో ప్రతిపక్షాలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వాదనకు మద్దతు ఇస్తే కనుక కోర్టు కలిగే అవకాశం ఉంది.
ఏది ఏమైనా నిమ్మగడ్డ వ్యవహారం సోమవారం హైకోర్టులో ఏం జరగబోతోంది అన్న దాని విషయంలో చాలా ఉత్కంఠగా ఉంది. ఈ విషయంలో నిమ్మగడ్డ కి అదేవిధంగా ప్రభుత్వానికి సమాన అవకాశాలు ఉన్నాయి.వాదించే లాయర్ ప్రభుత్వం తరఫున గట్టిగా ఉంటే జగన్ నిర్ణయానికే కోర్టు మొగ్గుచూపుతోంది. ఒకవేళ గతంలో మాదిరిగా జగన్ నిర్ణయాలు కోర్టులో తుస్సుమన్నటు నిమ్మగడ్డ వ్యవహారంలో కూడా అదే సీన్ రిపీట్ అయితే జగన్ పరువు చాలా దారుణంగా పోతుంది. కాబట్టి నిమ్మగడ్డ వ్యవహారంలో గట్టి హోంవర్క్ తో జగన్ రంగంలోకి దిగితే బెటర్ అని చాలామంది అంటున్నారు.