హెచ్‌డీఎఫ్‌సీలో చైనా కేంద్ర బ్యాంక్ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా మార్చి త్రైమాసికం ముగిసేసరికి తనఖా రుణాల సంస్థ వాటాను పెంచుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఎక్స్ఛేంజీల నుంచి అందుతున్న సమాచారం ఆధారంగా చూస్తే… హెచ్‌డీఎఫ్‌సీలో పీపుల్స్ బ్యాంక్ చైనాకు 1,74,92,090 షేర్లు ఉండగా… కంపెనీ షేర్ క్యాపిటల్‌లో ఇది 1.01 శాతంగా ఉంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భయాలతో సూచీలు గత రెండు నెలల్లో…
గణనీయంగా సరిదిద్దారు. ఈ తరుణంలో మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి చైనా బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయని ప్రచారం జరుగుతుంది. ఏ ధర వద్ద షేర్లను కొనుగోలు చేసింది అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. జనవరి 1న రూ.2,433.75 వద్ద హెచ్‌డీఎఫ్‌సీ షేరు.. మార్చి 31కి రూ.1,630.45కు దిగొచ్చింది. మన దేశానికి కరోనా వైరస్ కట్టడి చేయడంలో సహకరించి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి అని చైనా భావిస్తుంది.