ఒక పక్క కరోనా వైరస్ తీవ్రతకు జనాలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. బయటకు చెప్పలేక లోపల లోపల బాధ పడే వాళ్ళు ఉన్నారు. లాక్ డౌన్ తో ఎవరికి కంటి నిండా నిద్ర ఉండటం లేదు. కడుపు నిండా తిండీ ఉండటం లేదు. ఈ తరుణంలో అడవి జంతువులు, విష పూరిత సర్పాలు ఇళ్ళల్లో ఉండే ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. తెలంగాణాలో ఈ మధ్య చోటు చేసుకుంటున్న సంఘటనలు భయపెడుతున్నాయి.
సాధారణంగా పాము అనే పేరు ఉంటే ఎవరికి అయినా సరే భయం ఉంటుంది. ఒక్క చిన్న పాము పిల్లని చూస్తేనే గుండె జల్లుమనే పరిస్థితి ఉంటుంది. కాని 50 పాము పిల్లలు జనాల కంటి మీద కునుకు లేకుండా చేసాయి. తెలంగాణా రాష్ట్రంలోని మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారే 50 పాము పిల్లలు బయటపడ్డాయి. కాని వాటిని చూసి మహిళ భయపడలేదు.
ఆ గ్రామానికి చెందిన మహిళ 50 తాచు పాములను కర్రతో కొట్టి చంపడం గమనార్హం. గవలపల్లిలోని కొంక లచ్చల్ అనే వ్యక్తి భార్య స్వరూపతో కలిసి తన వాకిట్లోని బండ రాళ్లను తొలగిస్తున్నారు. దానికింద నుంచి 50 పాము పిల్లలు బయటకు రావడం కలకలం రేపాయి. స్వరూప ఏ మాత్రం భయపడలేదు. వాటిని వెంటాడి వెంటాడి వేటాడి చంపేశారు. విష సర్పాలు కావడంతో జాగ్రత్తగా వాటిని చంపేసింది.