ఆరోగ్య సేతు యాప్ కి ప్రపంచం ఫిదా…!

-

దేశంలో కరోనా వైరస్ కట్టడికి… భారత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ఆరోగ్య సేతు. దీని ద్వారా కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించడమే కాకుండా ప్రభుత్వాలను అప్రమత్తం చేసే విధంగా ఈ యాప్ పని చేస్తుంది. మన దేశంలో దాదాపు రెండు కోట్ల మంది వరకు ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి మంచి స్పందన రావడం తో కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింతగా అభివృద్ధి చేస్తుంది.

కరోనా కట్టడికి ఇది ఉపయోగపడుతుంది అని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇదే తరహా యాప్ కి బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దేశాలు భారత్ నుంచి సూచనలు తీసుకుంటున్నాయి. ఈ యాప్ ని తమకు కూడా కావాలని ఇప్పటికే కేంద్ర సమాచార శాఖను సంప్రదించారట. ముఖ్యంగా అమెరికా ఈ యాప్ కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది.

ఈ యాప్ ఉంటే అమెరికాలో కేసులు కట్టడి కావడమే కాకుండా వెంటనే ఆస్పత్రికి వచ్చే అవకాశం ఉంటుంది అని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ దేశాలకు ఇది మార్గ దర్శకంగా నిలుస్తుందని అభినందించింది. దీని ద్వారా కరోనా కట్టడి సాధ్యమవుతుందని పేర్కొంది. సమాచార భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే ఈ యాప్ ని రూపొందించారని చెప్పింది. ఇక ఈ యాప్ ని ఫోన్స్ లో ప్రవేశ పెట్టడానికి యాపిల్ గూగుల్ ప్రయత్నాలు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news