ఐపిఎల్ నిర్వహిస్తారు… ఎలా అంటే…!

-

క్రికెట్ అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూసే మెగా టోర్నీ ఐపిఎల్. ప్రపంచ కప్ కి దగ్గరగా దీని క్రేజ్ ఉంటుంది. ఇంకా ప్రపంచకప్ మ్యాచులను అయినా పక్కన పెడతారు గాని ఐపిఎల్ ని మాత్రం పక్కన పెట్టే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం ఐపిఎల్ నిర్వహణ విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. అసలు ఐపిఎల్ ని నిర్వహిస్తారా లేదా అనేది స్పష్టత రావడం లేదు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కూడా ఏమీ చెప్పడం లేదు.

బోర్డ్ ఈ విషయంలో తీసుకునే నిర్ణయం ఏంటీ అనేది సోమవారం తెలిసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఐపిఎల్ విషయంలో బోర్డ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ నిర్ణయం ఏంటీ అంటే… ఐపిఎల్ ని నిర్వహించినా సరే ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని భావిస్తున్నారు. అది కూడా రెండు మూడు మైదానాల్లోనే నిర్వహిస్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా చాలా తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.

అలాగే బెంగాల్ లో కూడా కరోనా ప్రభావం తక్కువగానే ఉంది. దీనితో ఈశాన్య రాష్ట్రాలు అయిన హిమాచాల్ ప్రదేశ్, త్రిపుర, అసోం రాష్ట్రాల్లో టోర్నీ నిర్వహించే యోచనలో ఉన్నారు. అలాగే ఝార్కాండ్ లో కూడా తక్కువగానే ఉన్నాయి కేసులు. దీనితో ఆయా రాష్ట్రాలలో టోర్నీ నిర్వహించే అంశంపై బోర్డ్ ఇప్పుడు ఇప్పుడు క్రికెట్ కమిటీలతో చర్చలు జరుపుతుంది. త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news