వ్యాక్సిన్ మినహా మార్గం లేదు, WHO సంచలన వ్యాఖ్యలు…!

-

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అల్ల కల్లోలం సృష్టిస్తుంది. అన్ని దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తుంది. అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కేసులు 7 లక్షలకు పైగా నమోదు కావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఇక అక్కడ 25 వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్, ఇటలీ, చైనా, జర్మని, స్పెయిన్ దేశాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. చైనాలో తగ్గినట్టే తగ్గి కేసులు పెరుగుతున్నాయి.

ఇక దీనిపై లాక్ డౌన్, సామాజిక దూరం మినహా మార్గం లేదని ఇన్నాళ్ళు చెప్తూ వచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. దానికి వ్యాక్సిన్ కనుక్కోవడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేసింది. సామాజిక దూరం పాటించినా సరే కేసులు పెరుగుతాయని పేర్కొంది. ప్రపంచ దేశాలు అసలు ఆంక్షలు తగ్గించావద్దు అని పేర్కొంది. ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

తక్కువ అంచనా వేసి ఆంక్షలు సడలిస్తే పెను ప్రమాదం తప్పదు అంటూ హెచ్చరించింది. ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఇప్పుడు లాక్ డౌన్ విదిస్తునే ఆర్ధిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. కాగా ప్రస్తుతం అన్ని దేశాలు కూడా వ్యాక్సిన్ కనుక్కొనే పనిలో ఉన్నాయి. ఇందుకు గాను వేల కోట్ల రూపాయలను కేటాయించాయి.

Read more RELATED
Recommended to you

Latest news