బిగ్ బ్రేకింగ్; మే 3 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్;మోడీ

-

ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. లాక్ డౌన్ పై ఆయన కీలక ప్రకటన చేసారు. కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విస్తరిస్తుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని దేశాన్ని రక్షిస్తున్నారన్న ఆయన… నాకు తెలుసు ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారు అనేది అని మోడీ వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో నేను అర్ధం చేసుకున్నా అన్న ఆయన… ప్రజలు అందరూ సైనికుల్లా పని చేస్తున్నారని అన్నారు.

కరోనాపై ప్రజలు బాగా పోరాటం చేస్తున్నారని, కరోనాపై పోరాటానికి ప్రజలు అందరూ సహకరిస్తున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు కొత్త సంవత్సరం జరుపుకున్తున్నాయని అన్నారు. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కరోనాపై పోరాటం చేయడంలో దేశం అంతా ఒకే తాటిపై ఉందన్నారు మోడీ. దేశంలోకి ఎవరు వచ్చినా స్క్రీనింగ్ చేసామని, ఒక్క కేసు నమోదు కాక ముందే ఇది జరిగిందని అన్నారు.

21 రోజుల లాక్ డౌన్ ని దేశం కట్టుదిట్టంగా అమలు చేసిందని అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే దేశం చాలా బాగా కట్టడి చేస్తుందని అన్నారు. కరోనా మహమ్మారిగా మారకముందే చర్యలు చేపట్టామని చెప్పుకొచ్చారు. కరోనాపై మన పోరాటం సంతృప్తి కరంగా ఉందని అన్నారు. కరోనాపై వేగంగా నిర్ణయాలు తీసుకున్నామని, దేశంలో 550 కేసులు ఉన్నప్పుడు లాక్ డౌన్ నిర్ణయం విధించామని అన్నారు..మే 3 వరకు దేశ వ్యాప్త లాక్ డౌన్ ని విధిస్తున్నట్టు చెప్పారు.

ఈ నెల 20 వరకు కఠినంగా లాక్ డౌన్ ని అమలు చేస్తున్నామని మోడీ పేర్కొన్నారు. మరో 19 రోజులు లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టు ఆయన వివరించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్ ని నిలిపివేయడం సరికాదని అన్నారు. ఇతర దేశాల్లో మన కంటే 20 నుంచి 30 శాతం కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. కరోనా హాట్ స్పాట్ కాని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు ఈ నెల 20 తర్వాత ఉండవని అన్నారు.

పరిస్థితుల బట్టీ సమీక్షలు చేసి ఆంక్షలు తొలగిస్తామని మోడీ వివరించారు. ఇకపై కరోనా హాట్ స్పాట్ లపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతామని మే 3 వరకు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేసారు. దేశంలో ప్రతీ కరోనా హాట్ స్పాట్ పై ఫోకస్ పెట్టామని అన్నారు. ఇక నుంచి లాక్ డౌన్ ఆంక్షలు చాలా కతినంగా ఉంటాయన్న ఆయన… లాక్ డౌన్ ని నిబంధనలపై రేపు మార్గ దర్శకాలు విడుదల చేస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news