బ్రేకింగ్; ఐపిఎల్ నిరవధిక వాయిదా…!

-

కరోనా వైరస్ నేపధ్యంలో ఐపిఎల్ ని నిరవధికంగా వాయిదా వేస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కరోనా ప్రభావం తో మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ ని మే 3 వరకు పొడిగించారు. ఈ నేపధ్యంలో ఐపిఎల్ ని నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. లాక్ డౌన్ తర్వాత ఎత్తేసినా ఆ తర్వాత మాత్రం వినోద, క్రీడా కార్యక్రమాలను నిర్వహించే అవకాశం లేదు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ ని నిరవధికంగా వాయిదా పడిందని సమాచారం. ఈ టోర్నీ మార్చి 29 నుండి వాంఖడే స్టేడియంలో ప్రారంభం కావాల్సి ఉంది, కాని వైరస్ వ్యాప్తి కారణంగా, 13 వ సీజన్ ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసారు. దేశవ్యాప్తంగా పరిస్థితి మరింత దిగజారడంతో ఇప్పటికే 10000 కి పైగా కేసులు నమోదయ్యాయి , లాక్డౌన్ మే 3 వరకు పొడిగించారు. ఇప్పటికే అన్ని జట్లకు సమాచారం ఇచ్చారు.

ఇదిలావుండగా, అక్టోబర్-నవంబర్ లో ఈ టోర్నీ నిర్వహించే అవకాశం ఉందనే వార్తలను బిసిసిఐ కోశాధికారి అరుణ్ ధుమల్ సోమవారం ఖండించారు. లాక్డౌన్ ఎప్పుడు ముగుస్తుందో కూడా మాకు తెలియదని పేర్కొన్నారు. దీనితో ఈ టోర్నీ ఇక ఈ ఏడాది నిర్వహించే అవకాశం లేదు అనే విషయ౦ అర్ధమైంది. వచ్చే ఏడాది ఈ సీజన్ ని రెగ్యులర్ గా నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పుడు ఏ ధరకు అయితే ఆటగాళ్లను కొనుగోలు చేసారో అదే ధరకు వచ్చే ఏడాది కొనసాగించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news