రైల్వే కఠిన నిర్ణయం – వందే భారత్, అమృత్ భారత్ టికెట్లపై కొత్త రూల్స్

-

రైలు ప్రయాణం అనగానే మనందరికీ గుర్తొచ్చేది తక్కువ ఖర్చు, సౌకర్యం. అయితే మారుతున్న కాలంతో పాటు భారతీయ రైల్వే కూడా తన రూపురేఖలను మార్చుకుంటోంది. ముఖ్యంగా వందే భారత్, అమృత్ భారత్ వంటి ప్రీమియం రైళ్లు అందుబాటులోకి వచ్చాక ప్రయాణ వేగం పెరిగింది. కానీ అదే సమయంలో నిబంధనలు కూడా కఠినతరం అవుతున్నాయి. తాజాగా టికెట్ రద్దు మరియు రీఫండ్ విషయంలో రైల్వే తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సామాన్య ప్రయాణికుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అసలు ఆ కొత్త నిబంధనలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

రీఫండ్ నిబంధనల్లో కీలక మార్పులు: సాధారణంగా ఏదైనా అత్యవసర పని పడి రైలు ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తే, మనం టికెట్ క్యాన్సిల్ చేసి కొంత మొత్తాన్ని రీఫండ్‌గా పొందుతాము. కానీ వందే భారత్, అమృత్ భారత్ వంటి సూపర్ ఫాస్ట్ రైళ్ల విషయంలో రైల్వే శాఖ ఇప్పుడు కఠినంగా వ్యవహరించనుంది. కొత్త నిబంధనల ప్రకారం రైలు బయలుదేరడానికి నిర్ణీత సమయం కంటే తక్కువ వ్యవధిలో (ముఖ్యంగా చివరి 4 గంటల్లో) టికెట్ రద్దు చేస్తే పైసా కూడా రీఫండ్ రాదు.

ప్రయాణికులు చివరి నిమిషంలో ప్లాన్ మార్చుకోవడం వల్ల రైల్వేకు జరుగుతున్న నష్టాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రయాణికులు తమ ప్రయాణాల విషయంలో మరింత ముందుచూపుతో ఉండాల్సిన అవసరం ఏర్పడింది.

Indian Railways’ Tough Call: New Ticket Rules for Vande Bharat & Amrit Bharat Trains
Indian Railways’ Tough Call: New Ticket Rules for Vande Bharat & Amrit Bharat Trains

ప్రయాణికులపై పడే ఆర్థిక భారం: ఈ కొత్త రూల్స్ వల్ల మధ్యతరగతి ప్రయాణికులపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. గతంలో చార్ట్ తయారీ తర్వాత కూడా కొంత మేర రీఫండ్ వచ్చే వెసులుబాటు ఉండేది కానీ ఇప్పుడు ఆ అవకాశం పూర్తిగా కనుమరుగవుతోంది. ఒకవేళ మీరు వెయిటింగ్ లిస్ట్‌లో ఉండి అది కన్ఫర్మ్ కాకపోతే రీఫండ్ ప్రక్రియలో పెద్దగా మార్పులు లేవు కానీ, కన్ఫర్మ్ అయిన టికెట్లను రద్దు చేయడం మాత్రం ఇప్పుడు జేబుకు చిల్లు పెట్టే విషయమే.

ముఖ్యంగా అమృత్ భారత్ వంటి సాధారణ ప్రజల కోసం ప్రవేశపెట్టిన రైళ్లలో కూడా ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేయడం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రయాణం ఖాయం అనుకుంటేనే టికెట్ బుక్ చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

భారతీయ రైల్వే ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో, ప్రయాణికులు కూడా కొత్త నిబంధనలకు అనుగుణంగా మారక తప్పదు. రైళ్లలో సీట్లు ఖాళీగా పోకుండా చూడటం మరియు ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా రైల్వే ఈ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రయాణికులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు నిపుణులు. టికెట్ విషయం లో ఏవైనా మార్పులుంటే కనీసం 24 గంటల ముందే నిర్ణయం తీసుకోవడం మేలు.

 

Read more RELATED
Recommended to you

Latest news