కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి గానూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు స్వీయ-నిర్బంధంలో ఉన్నారు. మరియు సామాజిక దూరాన్ని చాలా కఠినంగా పాటిస్తున్నారు. ఇక తాము ఈ సమయంలో ఎం చేస్తున్నామో పలువురు వివరిస్తున్నారు సోషల్ మీడియాలో. తాజాగా ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో ఏంటీ అంటే… ఇటలీలో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే.
దీనితో బయటకు ఎవరూ రావడం లేదు. ఈ తరుణంలో పొరుగింటి వాళ్ళతో కలిసి… బాల్కనీ లో నుంచుని మందు కొట్టారు ఇటలీ ప్రజలు. వృద్దులు యువకులు అందరూ కూడా జాగ్రత్తగా కర్రలకు వైన్ గ్లాసులు కట్టి చీర్స్ కొట్టారు. దీనికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. వైన్ పార్టీ వీడియోను మౌరో రిసిగ్లియానో అనే యూజర్ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. “నైబర్‌హుడ్ టోస్ట్” అని క్యాప్షన్‌లో రాశాడు.
ఈ వీడియో షేర్ అయిన వెంటనే వైరల్ అయింది. సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేయడమే కాదు అంతర్జాతీయ మీడియా ను కూడా ఈ వీడియో ఆకట్టుకుంది. దాదాపు 70 లక్షల మంది ఈ వీడియో ని వీక్షించారు. కాగా ఇటలీ లో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తుంది. అక్కడ మరణాలు తగ్గుతున్నాయి. కేసులు కూడా రోజుకి రెండు నుంచి మూడువేలు మాత్రమే నమోదు అవుతున్నాయి.
Brindisi di quartiere ???To use this video in a commercial player or in broadcasts, please email licensing@storyful.com
Posted by Mauro Ricigliano on Monday, 13 April 2020