ఐసోలేషన్ క్రికెట్ కప్ మొదలయింది… మామూలు ఐడియా కాదుగా…!

-

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్డౌన్ విధించింది కేంద్రం. దీనితో ఎవరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చే పరిస్థితి దాదాపుగా లేదు అనే విషయం అర్ధమవుతుంది. దీనితో లాక్ డౌన్ నుంచి బయటకు రావడానికి మార్గం లేకపోవడం తో సోషల్ మీడియా మీద దృష్టి పెట్టారు జనాలు. కొత్త కొత్త అలవ్ట్లు చేసుకుంటున్నారు. భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి తన తోటి క్రికెటర్లతో అత్యంత సృజనాత్మకంగా ఆలోచించింది.

కృష్ణమూర్తితో పాటు మోనా మెష్రామ్, రీమా మల్హోత్రా, అనుజ్ మల్హోత్రా, ఆకాంక్ష కోహ్లీ, లిసా స్టాలేకర్ కలిసి తమ ఇళ్ల నుంచి కలిసి క్రికెట్ ఆడుతున్న వీడియోను షూట్ చేసారు. “మేము క్రికెట్‌ను కోల్పోతున్నాము, కాబట్టి మేము ఇంట్లో ఉన్నప్పుడు మా స్వంత లీగ్‌ను సృష్టించా౦. మీకు ఐసోలేషన్ క్రికెట్ కప్ ను అందిస్తున్నామని పేర్కొంది ఆమె. ఒక కుండ లోపల తాత్కాలిక వికెట్‌కు కెమెరా సెట్ చేసి… వీడియో మొదలు పెట్టారు.

కామెంటేటర్ లిసా స్టాలేకర్‌తో వీడియో ప్రారంభమవుతుంది. అప్పుడు బౌలర్ మరియు అంపైర్‌గా వ్యవహరిస్తున్న రీమా మల్హోత్రా మరియు అనుజ్ మల్హోత్రా తెరపై కనపడతారు. వికెట్ కీపర్‌గా నటిస్తున్న మోనా మేష్రామ్ కూడా తన పడకగది నుండి సన్నివేశంలో చేరుతుంది. అప్పుడు వేద కృష్ణమూర్తి పిచ్ వద్దకు వస్తుంది. ఆమె వెనుక, వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తున్న ఆకాంక్ష కోహ్లీ మనకు కనపడుతుంది. ఈ వీడియోను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) “ఐసోలేషన్ క్రికెట్ గరిష్ట స్థాయికి చేరుకొని ఉండవచ్చు” అనే శీర్షికతో పోస్ట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news