ట్రాఫిక్ నిబంధనల విషయంలో పోలీసులు చాలా సీరియస్ గా ఉంటున్నారు. ఎక్కడిక్కడ ప్రజలకు అవగాహన కల్పిస్తూనే రూల్స్ ఫాలో అవ్వని వాళ్ళ విషయమో చాలా కఠినం గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. రూల్స్ ఫాలో అవ్వని వారి విషయంలో పోలీసులు ఎంత సీరియస్ గా ఉన్నారో చెప్పే వార్త ఇది. వాహనంతో రోడ్డెక్కేటప్పుడు హెల్మెట్, ఆర్సీ, కారు అయితే సీటుబెల్ట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ చూసుకుంటారు చాలా మంది.
కాని అక్కడితో ఆగవద్దు… సైడ్ మిర్రర్స్ (అద్దాలు) ఉన్నాయా..? అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కేవలం మూడు నెలల్లోనే సైడ్ అద్దాలు లేని వాళ్ళ మీద భారీగా కేసులు నమోదు చేసారు. 27,709 మందిపై కేసులు నమోదు చేసారు పోలీసులు.
ఇక భారీ జరిమానా విధించారు పోలీసులు. 29,30,715 (ఈ చలానా) జరిమానా రూపంలో వసూలు చేసారు. మోటార్ వెహికిల్ యాక్టు 1988, జీవో 108/2011 (ట్రాన్స్‌పోర్టు, రోడ్ అండ్ బిల్డింగ్స్) జరిమానాలు విధిస్తున్నారు పోలీసులు. ఎవరూ సైడ్ మిర్రర్ లేని వాళ్ళు ఎవరూ కూడా బయటకు రావొద్దు.
అవాక్కవుతున్న వాహనదారులు..
సైడ్ మిర్రర్ లేకపోయినా పోలీసులు జరిమానాలు విధిస్తున్నారని తెలియదని వాహనదారులు వాపోతున్నారు. అవగాహన కల్పించకుండా జరిమానాలు విధించడం తగదని విమర్శిస్తున్నారు.