కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నిరవధికంగా వాయిదా వేసినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపధ్యంలో కేంద్రం లాక్ డౌన్ ని మే 3 వరకు పెంచిన సంగతి తెలిసిందే. దీనిని ముంబై పోలీసులు సమర్ధించారు. ఈ మేరకు ఒక ట్వీట్ కూడా చేసారు. ఐపిఎల్ కప్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి… ఒక కామెంట్ చేసారు.
ఐపిఎల్‌ను ఇండియా ప్రాక్టీసింగ్ లాక్డౌన్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ కి మంచి స్పందన వచ్చింది. కరోనా కట్టడి విషయంలో ముంబై పోలీసులు చాలా బాగా కష్టపడుతున్నారని “యునైటెడ్ ఇండియా గెలుస్తుంది” అని ఒకరు కామెంట్ చేయగా “అవును, ఖచ్చితంగా ఇది కరెక్ట్ అని ఒకరు కామెంట్ చేసారు. మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకి అత్యంత వేగంగా పెరుగుతున్నాయి.
ఈ ఒక్కరోజే మహారాష్ట్రలో 288 కరోనా కేసులు నమోదు కాగా అక్కడ మొత్తం 194 మంది మరణించారు. ఆసియా లోనే అతిపెద్ద మురికి వాడ దారావిలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దాదాపు 70 మందికి ఈ మురికివాడలో కరోనా వైరస్ సోకింది. ఇక ముంబై లో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక్కడ వెయ్యి కేసులు దాటాయి.
(I)ndia (P)racticing (L)ockdown
Indian cities won’t take on each other. Instead, a united India will win this match against #coronavirus .#INDvCOVID#PerfectPitchForLockdown#TakingOnCorona pic.twitter.com/QUvpnfJq7r
— Mumbai Police (@MumbaiPolice) April 16, 2020