కరోనా ప్రభావం తో లాక్ డౌన్ ని ప్రకటించారు. లాక్ డౌన్ తో కరోనా కట్టడి అవుతుంది బాగానే ఉంది. కాని ఆపన్నులకు అండగా ఉండేది ఎవరు. ప్రతీ నిమిషం ఏదోక కష్టం ఏదోక రూపంలో ఎవరో ఒకరికి ఎన్నో రకాలుగా వస్తూనే ఉంటుంది. కరోనా వైరస్ దెబ్బకు హైదరాబాద్ లో ఉండే వేలాది మంది ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో పేదలు, అనారోగ్యానికి గురయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
జనాభా ఎక్కువ కాబట్టి ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీనితో ఇప్పుడు వాళ్ళు అందరికి సైబరాబాద్ పోలీసులు అండగా నిలబడుతున్నారు. అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో సైబరాబాద్ పోలీసులు అండగా నిలుస్తున్నారు. వెంటనే తమ వాహనాల ద్వారా ఆస్పత్రులకు తరలిస్తున్నారు. గర్భిణి స్త్రీలకు కూడా వాళ్ళే అండగా నిలబడుతున్నారు. వెంటనే మెడికల్ సదుపాయం కల్పిస్తున్నారు.
అదే విధంగా అన్నం లేని వాళ్లకు కూడా వాళ్ళే అండగా నిలబడుతున్నారు. దాదాపు లక్ష మందికి ఇప్పటి వరకు వాళ్ళు భోజనం అందిస్తున్నారు. హైదరాబాద్ నలుమూలల్లో ఎక్కువగా భోజన సదుపాయాలను కల్పిస్తున్నారు. రెడ్ జోన్ గా ఉన్న ప్రాంతాల్లో కూడా నిత్యావసర సరుకులను కూడా అందిస్తున్నారు. ఇలా సైబరాబాద్ పోలీసులు ఎక్కడిక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా తమ వంతు బాధ్యత నిర్వహిస్తున్నారు.