వలస కార్మికులు, గ్రామస్తుల ఋణం ఎలా తీర్చుకున్నారో చూడండి…!

-

వలస కార్మికుల కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దేశ వ్యాప్తంగా వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు. వారికి అండగా నిలబడే వారే లేకపోయారు. సొంత ఊరు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది. తాజాగా రాజస్థాన్ లోని జైపూర్ లో ప్రత్యేక కార్యక్రమం చేసారు. రాజస్థాన్‌ సికర్‌ జిల్లా పల్సానా గ్రామంలో… ఒక స్కూల్ బిల్డింగ్ లో వలస కార్మికులను కొంత మందిని క్వారంటైన్‌లో ఉంచారు అధికారులు.

మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు వీరిలో ఉన్నారు. గ్రామస్థులు వారికి ప్రత్యేకంగా ఆతిథ్యం ఏర్పాటు చేయడంతో తమకు ఇంత అండగా నిలబడిన వారి కోసం ఏదొకటి చెయ్యాలి అని ఆలోచన చేసి… తమకు ఆశ్రయయిచ్చిన పాఠశాలకు రంగులు వేసి చాలా కాలం అయిందని వాళ్ళు గుర్తించారు. దీనితో వెంటనే గ్రామ సర్పంచ్ ని కలిసారు వాళ్ళు. స్కూల్ రంగులు వేసి ఇస్తామని అన్నారు.

దీనితో సానుకూలంగా స్పందించిన గ్రామ సర్పంచ్, సదరు పాఠశాల సిబ్బంది అవసరమైన వస్తువులు తెప్పించి వారికి ఇచ్చారు. అక్కడ ఉన్న ఇతర రాష్ట్రాల వలస కార్మికులు క్వారంటైన్ గడువు ముగిసే లోపు స్కూల్ భవనానికి, గోడలకు రంగులు వేసి… కృతజ్ఞత చాటుకున్నారు. ఈ పని చేసినందుకు గానూ సదరు గ్రామ సర్పంచ్ కొంత మొత్తం ఇవ్వాలి అని భావించినా వాళ్ళు సున్నితంగా తిరస్కరించి మాకు ఇన్నాళ్ళు భోజనం పెట్టారని అందుకే తాము ఇది చేసామని… తమకు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఊరికి ఇవ్వండని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news