ఉద్యోగులకు ఓయో షాక్.. వేతనాల్లో 25 శాతం కోత

-

సాఫ్ట్ బ్యాంక్ సహకారంతో భారత్‌లో అతిపెద్ద హోటల్ చెయిన్‌గా అవతరించిన ప్రముఖ వ్యాపార సంస్థ ఓయో మీద కూడా కరోనా ప్రభావం భారీగానే పడింది. లాక్ డౌన్ కారణంగా హోటల్స్ మూతపడటం కారణంగా.. ఓయో ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఈ క్రమంలో ఇప్పటికే హోటల్ యాజమాన్యాలకు చెల్లింపులు రద్దు చేస్తున్నట్లు  ‘ఓయో’ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇండియాలోని తమ సంస్థ ఉద్యోగుల జీతాలలో కోత విధిస్తున్నట్టు తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు నాలుగు నెలల పాటు ఓయో ఉద్యోగుల జీతాల్లో 25 శాతం కోత విధిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

అంతేకాకుండా మే 4 నుంచి ఆగస్టు 30 వరకు కొందరు ఉద్యోగులను లీవ్ విత్ లిమిటెడ్ బెనిఫిట్స్ కింద సెలవులు ఇవ్వనున్నారు. అయితే వీరికి పరిమిత ప్రయోజనాల కింద మెడికల్ ఇన్సురెన్స్, పెరేంటల్ ఇన్సురెన్స్, స్కూల్ ఫీజు రీయింబర్స్‌మెంట్, ఎక్స్‌గ్రేషియా సాయం అందనున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం దాదాపు 3,500 మందిని సెలవుపై పంపే అవకాశం ఉంది.

ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఓయో సీఈవో రోహిత్ కపూర్ ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారం అందజేశారు. తప్పనిసరి పరిస్థతిలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా హోటల్స్ బిజినెస్‌లు భారీగా దెబ్బతిన్నాయని రోహిత్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news