గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు పెరగడం మొదలుపెట్టాయి. రెండు మూడు రోజుల నుంచి 90 రూపాయల వరకు పెరుగుతూ వస్తున్న ధరలు ఇప్పుడు ఒక్క రోజే భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో గురువారం బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు 650 రూపాయల పెరిగి… 41,050 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే… 680 రూపాయలు పెరిగింది.
దీనితో 44,780 రూపాయలకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్లు పది గ్రాములకు గానూ 650 రూపాయల పెరిగాయి. దీనితో 41,050 రూపాయలుగా ఉంది బంగారం ధర. 24 క్యారెట్ల బంగారం ధర 680 రూపాయల పెరిగింది. 44,780 రూపాయలుగా ఉంది. దేశరాజధాని ఢిల్లీలో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 450 రూపాయలు పెరిగింది.
44,900 రూపాయలకు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 310 రూపాయలకు చేరుకుంది. 42,160 రూపాయలకు చేరింది బంగారం. గత కొన్ని రోజులుగా బంగారం డిమాండ్ భారీగా పడిపోతుంది. అయినా సరే బంగారం ధరలు పెరుగుతూ రావడం ఆశ్చర్యంగా ఉంది. కేజీ వెండి ధర 42 వేల మార్కుకి దిగింది.