మమతా బెనర్జీ పిలుపు.. కార్గో విమానంలో కోల్‌కత్తాకు ప్రశాంత్ కిషోర్

-

ఎన్నికల వ్యుహాకర్తగా మంచి పేరుపొందారు.. ప్రశాంత్ కిషోర్. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎన్నికల వ్యుహాకర్తగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బెంగాల్‌లో కరోనాను అదుపు చేయడంలో మమత సర్కార్ విఫలమైందని బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పరిస్థితులపై అధ్యయనం చేయడానికి కేంద్రం ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీమ్‌ సభ్యులు కూడా కోల్‌కతాకు పంపింది.

ఈ సమయంలో బీజేపీ విమర్శలను తిప్పికొట్టడంతోపాటుగా, తనకు మార్గదర్శనం చేయాలంటూ మమత కార్యాలయం నుంచి అత్యవసరంగా ప్రశాంత్ కిషోర్‌కు పిలుపు వచ్చింది. నెల రోజుల కిందట లాక్‌డౌన్‌ కారణంగా ‘బం‍గ్లార్‌ గార్బో మమతా’ ప్రచార కార్యక్రమానికి తెరపడంతో ప్రశాంత్‌కిషోర్‌ ఢిల్లీ వెళ్లిపోయిన ప్రశాంత్ కిషోర్.. తిరిగి దీదీ నుంచి పిలుపురావడంతో కార్గో విమానంలో పశ్చిమబెంగాల్‌ చేరుకున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సమర్ధవంతంగా ఎదుర్కొవడానికి ప్రశాంత్ కిషోర్ వ్యుహాలు పనిచేస్తాయని టీఎంసీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు ప్రశాంత్ కిషోర్ కార్గో విమానంలో కోల్‌కత్తా చేరుకోవడంపై జేడీయూ, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ రహస్యంగా పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్నారని బీహార్ ప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ విమర్శించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కరోనా నియంత్రణకు కేంద్రం చేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతుందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news