రెడ్ అలెర్ట్: అవును కరోనా లక్షణాలు 4 కాదు 12!

-

ఇంతకాలం కరోనా విషయంలో భయం ఒకెత్తు… ఇకపై మరొకెత్తు అనిపించేస్థాయిలో లక్షణాలు పెరుగుతున్నాయంట! కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన కొత్తలో… జలుబు, పొడి దగ్గు, జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని.. క్వారంటైన్ కు చేరాలని.. పాజిటివ్ వస్తే ఐసోలేషన్ కు తరలిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే! ఈ నాలుగు లక్షణాల గురించి మన అందరికీ తెలిసిన సంగతే! అయితే… ఈ నాలుగు లక్షణాలే కాదు ఇంకో 8 లక్షణాలు అనిపించినా కూడా టెస్టులు చేయించుకోవాలని చెబుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ!

అవును… ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, మానవ శరీరంపై కరోనా వైరస్ కారణంగా 88 శాతం మందికి జ్వరం వస్తుంటుండగా.. 68 శాతం మందిలో పొడిదగ్గు, 38 శాతం మందిలో అలసట, 33 శాతం మందిలో శ్లేష్మ దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పిన క్రమంలోనే తాజా పరిస్థితుల నేపథ్యంలో వీటితో పాటు 19 శాతం మందిలో శ్వాస సమస్య, 15 శాతం మందిలో కండరాల నొప్పి, 14 శాతం మందిలో గొంతునొప్పి, తలనొప్పులు, 11 శాతం మందిలో చలిగా అనిపించడం వంటి లక్షణాలు కూడా ఉంటాయని.. ఇదే క్రమంలో 5 శాతం మందికి వికారం, ముక్కులో ఇబ్బంది, 4 శాతం మందిలో విరేచనాలు వంటి కనిపించవచ్చని చెబుతుంది.

ఇదే సమయంలో ఈ లక్షణాలపై మరింత వివరణ ఇచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ… ఈ అన్ని లక్షణాలు ఉండాల్సిన అవ్సరం లేదని… పాజిటివ్ వచ్చిన వారిలో కొందరికి ఒక లక్షణమే కనిపించగా, మరికొందరిలో మూడు, నాలుగు లక్షణాలు కనిపించాయని, అందుకని వీటిల్లో ఏ లక్షణం రోజుల తరబడి ఇబ్బంది పెడుతున్నా తక్షణమే కరోనా పరీక్షలు చేయిస్తేనే మంచిదని సిఫార్సు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news