దేశంలో విస్తృతంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ని తగ్గించడానికి సీనియర్ ఆర్ధికవేత్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొన్ని సూచనలు కేంద్రానికి ఇచ్చారు. దేశంలో వైరస్ సవాళ్లను అధిగమించడానికి కరోనా నిర్ధారణ పరీక్షలు అవసరమని తెలిపారు. అంతేకాకుండా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు టెస్ట్ కిట్లను పూర్తి స్థాయిలో సమకూర్చుకోవాలని తెలిపారు. చాలా రాష్ట్రాలలో టెస్టింగ్ కిట్ల కొరత ఉందని అన్నారు. ఇదే టైములో కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం కారణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ దారులకు ఇటీవల డీఏ నీ కేంద్ర ప్రభుత్వం నిలిపి వేయడం అన్నది సరైన నిర్ణయం కాదని మన్మోహన్ అన్నారు.బాధ్యత గల కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా రక్షణ దళాల పై ఈ విధంగా ఈ సమయం లో స్పందించడం మంచి నిర్ణయం కాదని చెప్పుకొచ్చారు. కరువు భత్యాన్ని నిలిపివేస్తే దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులతో పాటు 60 లక్షల మంది పింఛన్దారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారని మన్మోహన్ తెలిపారు. మామూలుగా అయితే ప్రతి ఏడాది రెండు సార్లు జనవరి మరియు జులై మాసాల్లో ద్రవ్యోల్బణం మేరకు ఉద్యోగుల కరువు భత్యాన్ని సవరిస్తారు. కేంద్ర ప్రభుత్వం గత నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం కరువు భత్యం (డీఏ) పెన్షర్లకు 21 శాతం కరువు సాయాన్ని పెంచింది.
అయితే కరోనా వైరస్ రాకతో చెల్లించాల్సిన నెక్స్ట్ డీఏ ను 2021 జూన్ 30 వరకు నిలిపివేయాలని ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయం వల్ల అనేక సమస్యలు పునరావృత్తం అవుతాయని సీనియర్ ఆర్థికవేత్త మన్మోహన్ చెప్పటం జరిగింది. ఇదే విషయాన్ని ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. మన్మోహన్ చెప్పింది కరెక్ట్ అని, సీనియర్ ఆర్థికవేత్తగా ఆయన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని సూచించారు.