పిల్లో ఛాలెంజ్ కాదు… పనికొచ్చే ఛాలెంజ్ ప్లీజ్!

-

లాక్ డౌన్ అమలు జరుగుతున్న నేపథ్యంలో సినీ స్టార్స్ ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో మరీ ఇంట్లో ఉండి బోర్ కొడుతుందనో ఏమో కానీ… రకరకాల ఛాలెంజ్ లను క్రియేట్ చేస్తూ కాలం గడుపుతున్నారు. ఇందులో భాగంగా… హీరోలు, డైరెక్టర్ లు, నిర్మాతలు “బి ద రియల్ మ్యాన్” చాలెంజ్ చేసుకుంటుంటే… స్టార్ హీరోయిన్లు “పిల్లో ఛాలెంజ్” పేరుతో పిల్లో మాత్రమే అడ్డం పెట్టుకొని ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు! ఈ ఛాలెంజ్ కూడా బాగానే పాపులర్ అవుతున్నది. ఈ విషయంలో ఇప్పటికే పాయల్, తమన్నాలు ఈ పిల్లో ఛాలెంజ్ చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ… ఈ ఛాలెంజ్ లు చేయడం వలన ఎవరి ఉపయోగం అనే ప్రశ్నలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి!

అవును… లాక్ డౌన్ కారణంగా దేశంలో నీరు పేదలకు, వలస కార్మికులకు ఆహరం అందటం లేక, ఆకలితో అల్లాడుతున్న సంగతి తెలిసిందే. వీరికి కొందరు దాతలు వారి వారి స్థోమత మేర ఆహరం అందిస్తున్న స్ అంగతి తెలిసిందే. ఇలాంటి సాయాలు చేసే విషయంలో హీరోయిన్ ప్రణీత ముందు వరసలో ఉంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. హీరోయిన్లలో మొదటగా కరోనా ఫండ్ ఇచ్చిన నటి ప్రణీత… అక్కడితో ఆగకుండా కొంతమంది వ్యక్తులతో కలిసి భోజనం తయారు చేసి పేదలకు అందజేస్తోంది. ఇది నిజంగా అభినందించాల్సిన విషయం! కరోనా కష్టకాలంలో గ్లామర్ పేరుతో ఇంట్లో కూర్చోకుండా పదిమందికి సహాయం చేయాలనే తలంపుతూ పదిమందితో కలిసి ఆహరం తయారు చేసి అందివ్వడం అన్నది నిజంగానే గొప్ప విషయం అని చెప్పాలి.

దీంతో… ప్రణీతపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. మిగిలినవారు కూడా పనికిమాలిన ఛాలెంజ్ లు చేసుకుని కాలయాపన చేసేకంటే… ఇలాంటి పనులనే ఛాలెంజ్ లుగా పెట్టుకుంటే… వారికి మంచి పేరు రావడమే కాదు, వాళ్ల పేరు చెప్పి పదిమంది పస్తులనుంచి తప్పించుకుంటారు! ఛాలెంజ్ ల విషయాల్లో ఇలా పనికొచ్చే విధంగా సెలబ్రెటీలు ఆలోచిస్తారని కోరుకుందాం!!


Read more RELATED
Recommended to you

Latest news