కరోనా వ్యాక్సిన్ కోసం భారత మహిళ కీలక పాత్ర…!

-

కరోనా వైరస్ కి సంబంధించిన మందు కనుక్కోవడానికి గానూ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ కోసం ఇప్పుడు యుద్ద ప్రాతిపదికన పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో ప్రముఖ వైద్యులు అందరూ పరిశోధనలు చేస్తున్నారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక బృందం మహమ్మారి వ్యాక్సిన్ ని అభివృద్దిని చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది.

ఈ బృందంలో కోల్‌కతాకు చెందిన ఒక మహిళ కీలక పాత్ర పోషిస్తుంది. చంద్ర దత్తా అనే మహిళ ఆక్స్ఫర్డ్ లో నివాసం ఉంటుంది. అక్కడ ఆమె విశ్వవిద్యాలయ౦లో క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్‌గా కూడా పనిచేస్తున్నారు, ఈ టీకాను గత వారం నుంచి పరిక్షలకు పంపించారు. అక్కడ విజయవంతం అయితే మాత్రం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ప్రజలకు అందుబాటులో ఉంచవచ్చు. దత్తా మాట్లాడుతూ, ఇదంతా ట్రయల్ డేటాపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

కలకత్తాకు చెందిన ఆమె గోఖలే మెమోరియల్ బాలికల పాఠశాలలో ప్రాధమిక విద్యను అభ్యశించారు. కోల్‌కతాలోని హెరిటేజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ మరియు బయోటెక్నాలజీలో బిటెక్ పూర్తి చేసింది. చివరికి, లీడ్స్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి-బయోసైన్స్ కోర్సును అభ్యసించడానికి ఆమె 2009 లో యుకెకు వెళ్లింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ క్లినికల్ బయో-మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఆమె బాధ్యతలు చేపట్టక ముందు జిఎస్కె, సెంజెర్ స్టార్టప్ కంపెనీలో మరియు ఆప్టుట్ అనే ఫార్మసీ కంపెనీలో పని చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news