ఇండియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌కు కూడా మయంతి టీవీ వ్యాఖ్యాతగా పనిచేసింది. అలాగే 2011, 2015 ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ ల సందర్భంగా టీవీలో వచ్చిన ప్రీ, పోస్ట్ మ్యాచ్ షోలకు కూడా ఈమె యాంకర్‌గా పనిచేసింది.
మయంతి లాంగర్.. క్రికెట్ అభిమానులకు ఈ పేరు బాగా చిరపరిచితమే. ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలుకొని భారత్ ఆడే దాదాపు ప్రతి ఒక్క మ్యాచ్‌కు మయంతి లాంగర్ టీవీ వ్యాఖ్యాతగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈమె స్టార్ టీవీతో ఒప్పందం చేసుకున్న కారణంగా ఆ టీవీ టెలికాస్ట్ చేసే అన్ని క్రికెట్ మ్యాచ్‌లకు ఈవిడే యాంకర్‌గా ఉంటోంది. అటు యాంకర్‌గానే కాదు, మైదానంలోనూ మయంతి లాంగర్ మాయ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆమెకు చాలా మంది ఫ్యాన్లు కూడా ఏర్పడ్డారు. అయితే మయంతి లాంగర్‌కు చెందిన పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మయంతి 1985లో ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీలో జన్మించింది. ఈమె తండ్రి లేట్ జనరల్ సంజీవ్ లాంగర్. ఐక్యరాజ్యసమితి కోసం పనిచేశారు. తల్లి పేరు ప్రెమిందా లాంగర్. ఢిల్లీలోని హిందూ కాలేజీలో మయంతి బీఏ (హానర్స్) చదివింది. ఇక ఈమెను ముద్దుగా మాయా అని పిలుస్తారు.
మయంతి స్పోర్ట్స్ జర్నలిస్ట్ కాకముందు గ్రాఫిక్ డిజైనర్ కావాలని కలలు కనేది. ఇక ఈమె మొదటి సారిగా జీస్పోర్ట్స్లో ఫుట్‌బాల్ కెఫె అనే ప్రోగ్రామ్‌కు యాంకర్‌గా పనిచేసింది. ఈ క్రమంలో ఆ ప్రోగ్రామ్ విజయవంతం కావడంతో మయంతి దశ కూడా తిరిగింది. ఇక ఆ తరువాత ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా తన కెరీర్ కొనసాగించి అందులో సక్సెస్ అయింది.
మయంతి లాంగర్ ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 1,58,000. కాగా ఈమె ఇండియన్ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీని వివాహం చేసుకుంది. ఈమె పెళ్లి అయి 7 సంవత్సరాలు అవుతోంది. ఇక ఈమె తన భర్త బిన్నీ కన్నా వయస్సులో 4 నెలలు పెద్ద కావడం విశేషం.
కేవలం క్రికెట్ మ్యాచ్‌లకు మాత్రమే కాదు, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్ తదితర క్రీడలకు కూడా మయంతి లాంగర్ టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉంటుంది. 2010లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌కు గాను భారత్‌లో ఈఎస్పీఎన్ చానల్లో ప్రసారాలు వచ్చాయి. అయితే ఆ ప్రసారాల సందర్భంగా ప్రీ మ్యాచ్, పోస్ట్ మ్యాచ్, హాఫ్ మ్యాచ్ అనాలసిస్ ప్రోగ్రామ్‌లకు మయంతి టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరించింది.
ది మార్టిన్ స్కోర్సెసె అనే హాలీవుడ్ సినిమా అంటే మయంతికి చాలా ఇష్టం. ఆ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డి కాప్రియో నటించగా, ఆ సినిమాకు 4 ఆస్కార్ అవార్డులు వచ్చాయి.
ఇండియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌కు కూడా మయంతి టీవీ వ్యాఖ్యాతగా పనిచేసింది. అలాగే 2011, 2015 ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ ల సందర్భంగా టీవీలో వచ్చిన ప్రీ, పోస్ట్ మ్యాచ్ షోలకు కూడా ఈమె యాంకర్‌గా పనిచేసింది. ఇక ఐపీఎల్‌లోనూ మయంతి యాంకర్‌గా రాణించింది. అలాగే రానున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లకు కూడా టీవీలో మయంతి లాంగర్ మనకు యాంకర్‌గా కనిపించనుంది.