కరోనా విషయం లో మరొక బాంబు లాంటి వార్త చెప్పిన చైనా .. !

-

చైనా దేశం కరోనా వైరస్ విషయంలో చాలా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఇప్పటికే అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవటానికి ప్రపంచ దేశాలపై చైనా ప్రయోగించిన బాణం కరోనా వైరస్ అని అంటున్నారు. ఈ విషయం నడుస్తూ ఉండగానే ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందిని బలి తీసుకున్న ఈ వైరస్ గురించి తాజాగా చైనా మరొక బాంబు లాంటి వార్త చెప్పింది.Coronavirus Treatment Could Lie in Existing Drugsఅదేమిటంటే 2002వ సంవత్సరంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన (SARS) వైరస్ మాదిరిగా ఈ వైరస్ అంతమైపోయేది కాదని తేల్చి చెప్పింది. భవిష్యత్తులో ఈ వైరస్ చాలా సైలెంట్ గా మనిషి శరీరంలోకి ప్రవేశించి లక్షణాలు కూడా కనిపించకుండా ఒకరి నుండి ఒకరికి వ్యాపించే అవకాశం ఉంది అనే డేంజర్ న్యూస్ చెప్పింది.

 

మొత్తంమీద చూసుకుంటే కరోనా మనతోనే జీవిస్తుందని చెప్పుకొచ్చారు. ఇకనుండి సీజనల్ వ్యాధుల మాదిరిగానే కరోనా వైరస్ కూడా వ్యాపిస్తుందని చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాతజిన్ బయోలజీ (Institute of Pathogen Biology) తెలిపింది. వేసవి కాలంలో కరోనా కేసులు తగ్గుతాయని కూడా చెప్పలేమని పేర్కొంది. వ్యాక్సిన్ దొరికితేనే పరిష్కార మార్గం దొరుకుతుందని చైనా చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news