నేను స్కిన్ షో చేయలేను;సాయి పల్లవి

-

చేసిన సినిమాలు తక్కువే అయినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం సాయి పల్లవి బాగా దగ్గర అయింది. ఆమె తన నటన తో ఎందరో అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె మూడు సినిమాలు చేస్తుంది. తెలుగులో ఆమెకు మంచి ఆదరణ ఉండటం తో దర్శక నిర్మాతలు కూడా ఆమెతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం నాగ చైతన్య తో లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆమె తన కెరీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. తాను నేచురల్‌గా కనిపించడానికే ఎక్కువ ఇష్టపడతానని పేర్కొంది ఆమె. కురచగా ఉండే దుస్తులు ధరించడం, మోతాదును మించి మేకప్ వేసుకోవడం నాకు ఇష్టం ఉండదని స్పష్టం చేసింది.

‘ఫిదా’ సినిమాలో ఒక సీన్‌లో కురచ డ్రెస్ వేసుకోవాల్సి వచ్చిందని… ఆ సన్నివేశానికి అది అవసరమని ఆమె గుర్తు చేసుకుంది. ఆ సినిమాలో అలా వేసుకున్నానని మరొకరు అడిగితే ఒప్పుకోనని స్పష్టంగా చెప్పింది. గట్టిగా ఒత్తిడి చేస్తే ఆ సినిమా నుంచి తప్పుకుంటా అని స్పష్టంగా చెప్పింది. గ్లామర్ అనే పదానికి నేను చాలా దూరంగా ఉంటానని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యులో ఆమె వ్యాఖ్యానించింది.

Read more RELATED
Recommended to you

Latest news