ఏపీలో కొంప ముంచిన టీ దుకాణం…!

-

ఈ కరోనా ఏమో గాని జనాలకు గుండె జల్లుమంటుంది. ఏ రూపంలో వస్తుందో కూడా ఎవరికి అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా అని జనాలు దండం పెట్టే పరిస్థితి వచ్చింది అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. ఏపీలో కరోనా వ్యాప్తికి సంబంధించి కొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా కేసుల సంఖ్య 104కు చేరుకున్నాయి.

అసలు నరసరావుపేట లో ఇన్ని కేసులు ఏ విధంగా వచ్చాయో అర్ధం కావడం లేదు. దీనిపై పోలీసులు పెద్ద ఎత్తున విచారణ చేసారు. లాక్ డౌన్ మొదలైన రోజే ఒక వ్యక్తి దాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా టీ దుకాణం పెట్టాడు. ఢిల్లీ మర్కాజ్ కి వెళ్లి వచ్చిన వ్యక్తి అక్కడ టీ తాగాడు. అక్కడే టీ తగిన మరో వ్యక్తికి కరోనా వచ్చింది. ఆ తర్వాత అతను ప్రాణాలు కోల్పోయాడు. ఎలా చనిపోయాడో ఎవరికి అర్ధం కాలేదు.

చనిపోయిన తరువాతే అతడికి కరోనా ఉందని పోలీసులకు తెలిసింది. అతడికి కాంటాక్ట్‌లో కుటుంబసభ్యులతో సహా ఇరుగుపొరుగున ఉన్న మరికొందరికి కరోనా సోకింది అని గుర్తించారు అధికారులు. వారి ద్వారా కరోనా అంత మందికి వచ్చిందని ఇప్పుడు కాంటాక్ట్స్ అందరిని గుర్తించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆ నగరంలో లాక్ డౌన్ ని చాలా కఠినం గా అమలు చేస్తున్నారు పోలీసులు. నగరం మొత్తాన్ని పూర్తిగా మూసేశారు.

Read more RELATED
Recommended to you

Latest news