తిత్లీ తుపాను బాధితులను సాధ్యమైనంత త్వరగా ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ను కోరారు. తిత్లీ మిగిల్చిన నష్టాన్ని అంచనా వేస్తూ రూపొందించిన వీడియోని సైతం గవర్నర్ కి చూయించారు. ఒక నివేదికను సైతం అందజేశారు. ఎన్నో ఏళ్లుగా పెంచిన చెట్లు, మొక్కలు విరిగిపోయి రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది..దీంతో వారు యథావిధి పరిస్థితిని చేరుకోవాలంటే మరో దశాబ్దం కంటే ఎక్కువ సమయం పడుతోందని వివరించారు. రైతులకు 100 శాతం రుణమాఫీ చేయాలని కోరారు. పవన్ తో పాటు ఇటీవలే జనసేనలో చేరిన నాదెండ్ల మనోహర్ ఉన్నారు.