టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బైక్స్ అంటే ఏ స్థాయిలో పిచ్చి ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. ఏ మ్యాచ్ లో ఏ బైక్ గిఫ్ట్ గా వచ్చినా ఎవరు బైక్ గిఫ్ట్ ఇచ్చినా సరే దాన్ని ధోని చాలా జాగ్రత్తగా దాచుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకోసం అతను ప్రత్యేకంగా ఒక గ్యారేజ్ నిర్మించుకున్నాడు. అక్కడ అన్ని రకాల బైక్స్ ఉంటాయని తెలిసిందే. దాదాపు 400 పైగా బైక్స్ రకాలు ఉన్నాయి.
అతను చిన్నప్పుడు తోలిన బైక్ నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రతీ మోడల్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఇప్పుడు కరోనా సాయ౦ కోసం తన బైక్స్ ని వేల౦ పాట వెయ్యాలి అని ధోని భావిస్తున్నాడు. ఒక పది బైక్స్ ని వేలం పాటలో విక్రయించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. జ్ఞాపకాలు అమ్మండి జ్ఞాపకం అవ్వండి అంటూ ఒక చాలెంజ్ ని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడని సమాచారం.
దీనికి సంబంధించి అతను ఇప్పుడు అమ్మే బైక్స్ ని బయట పెట్టినట్టు తెలుస్తుంది. వాటికి ఏమైనా రిపేర్ లు ఉంటే మెకానిక్స్ ని పిలిచి వాటిని బాగు చేయించి అమ్మే ఆలోచనలో ఉన్నాడు అని తెలుస్తుంది. త్వరలోనే మూడు బైక్స్ ని అక్కడ ఉన్న కాలేజి స్టూడెంట్స్ కొనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. వాటికి కనీస ధర ను కూడా ధోని ఫిక్స్ చేసి వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.