ప్రకృతి మనకు ప్రసాదించిన అనేక రకాల ఔషధ వృక్షాల్లో వేప కూడా ఒకటి. దీని ప్రయోజనాలు అనేకం. ముఖ్యంగా వేప చెట్టు ఆకులు మనకు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తాయి. వేప ఆకులను నిత్యం ఉదయాన్నే పరగడుపునే నమిలి తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. రుచి చేదుగా ఉన్నప్పటికీ నిత్యం ఈ ఆకులను తింటే మనకు కలిగే పలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. మరి వేపాకులు మనకు ఏవిధంగా ఉపయోగపడుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
* నిత్యం ఉదయాన్నే 10 వేపాకులను పరగడుపునే తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ తగ్గుతుంది. రక్తంలోని షుగర్ లెవల్స్ తగ్గుతాయి. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. మధుమేహం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
* వేపాకులను నిత్యం తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, అసిడిటీ ఉండవు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం ఉండదు. విరేచనం సాఫీగా అవుతుంది.
* వేపాకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే జీర్ణాశయం, పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.
* శరీరంలో ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు వేపాకులను తింటే చక్కని ప్రయోజనం ఉంటుంది. ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి.
* చర్మ సమస్యలు ఉన్నవారు నిత్యం వేపాకులను తింటే ఫలితం ఉంటుంది. ముఖ్యంగా చర్మంపై ఏర్పడే దద్దుర్లు, మచ్చలు తగ్గుతాయి. చర్మం సంరక్షించబడుతుంది.
* వేపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీటిని నిత్యం తింటే వెంట్రుకలు సంరక్షింపబడతాయి.
* కంటి సమస్యలు ఉన్నవారు నిత్యం వేపాకులను తినడం వల్ల కంటి చూపు పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది.
* శరీర రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు నిత్యం వేపాకులను తింటే మంచిది.
* వేపాకులను తినడం వల్ల నోటి దుర్వాసన, దంతాలు, చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. దంతాలు దృఢంగా మారుతాయి. నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. చిగుళ్ల నుంచి రక్తం కారకుండా ఉంటుంది. అందుకనే మన పెద్దలు చాలా మంది వేప పుల్లలతో దంతాలను తోముకుంటుంటారు.